ట్విట్టర్ రివ్యూ : నీవెవరో.. ఆది పినిశెట్టి థ్రిల్లర్ సినిమా ఎలా ఉందంటే!
Recommended Video

హీరో ఆది ఇటీవల చాలా చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. మరో వైపు హీరోగా కూడా సినిమాలు చేస్తున్నారు. కొంత గ్యాప్ తరువాత తెలుగు ఆదిహీరోగా చేస్తున్న చిత్రం నీవెవరో. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రం సాగుతుంది. ఈ చిత్ర ట్రైలర్, టీజర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్రిల్లర్ మూవీ కావడంతో ట్రైలర్ తోనే ఆడియన్స్ లో ఆసక్తి పెరిగింది. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇద్దరు భామలు తాప్సి, రితిక సింగ్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే ప్రీమియర్ షోలు ప్రారంభమైన నేపథ్యంలో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
పాత్రలు అద్భుతంగా
ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, తాప్సి, రితిక సింగ్ పాత్రలని అద్భుతంగా మలిచారు. రొటీన్ చిత్రాలకు విభిన్నంగా ఈ చిత్రం ఉంది.
కొన్ని సన్నివేశాలు
నీవెవరో చిత్రంలో కొన్ని సన్నివేశాలు బావున్నాయి. ఆది, తాప్సి పెర్ఫామెన్స్ బావుంది. కథ రొటీన్ అనిపిస్తోంది.
థ్రిల్లింగ్ లేదు
నీవెవరో చిత్రంలో థ్రిల్లింగ్ అంశాలు లేవు.
సెకండ్ హాఫ్
సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే సరిగా లేదు.
యావరేజ్
నీవెవరో చిత్రం యావరేజ్ గా ఉంది.
ఆది పాత్ర
ఈ మధ్య కాలంలో ఆది చేసిన వీక్ రోల్ ఇదే.
వెన్నెల కిషోర్
వెన్నెల కిషోర్ పెర్ఫామెన్స్ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్. కామెడీతో అదరగొట్టాడు.
ఇప్పుడు కూడా
తాప్సి ఇన్ని సినిమాలు చేసిన తరువాత కూడా నీవెవరో ఫస్ట్ హాఫ్ లో ఆమె పెర్ఫామెన్స్ బాగాలేదు.
బోరింగ్
సెకండ్ హాఫ్ బోరింగ్ గా ఉంది. నీవెవరో చిత్రం నిరాశపరిచి సస్పెన్స్ థ్రిల్లర్.
క్లాస్ లుక్స్
హీరో ఆది అంధుడిగా, చెఫ్ గా చాలా బాగా నటించాడు. అతడి లుక్స్ క్లాస్ గా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











