మహేష్ ‘బిజినెస్ మేన్’పై దుష్ర్పచారం?
ఆలు లేదు..చూలు లేదు..కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా..... మహేష్ బాబు నటించిన తాజా సినిమా 'బిజినెస్ మేన్' ఇంకా విడుదల కానేలేదు సినిమాలో ఇవి ప్లస్, ఇవి మైనస్ అంటూ ప్రచారం సాగుతోంది. దీనిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు కావాలని మహేష్ బాబు సినిమాపై ఇలాంటి దుష్ర్పచారం చేస్తున్నారని మండి ప డుతున్నారు.
బిజినెస్ మేన్ సినిమాపై జరుగుతున్న దుష్ర్పచారం ఏమిటంటే... సినిమాలో రక్తపాతం ఎక్కువగా ఉండబట్టే A సర్టిఫికెట్ జారీ చేశారట. టేకింగ్ విషయంలో పూరీ ఎక్కడా కొత్త దనం చూపించ లేదట. ఫస్ట్ హాఫ్ అంతా జాలీగా సాగుతుందట. తొలి సగ భాగంలో వచ్చే మహేష్, కాజల్ లిప్ కిస్ సీన్, సారొస్తా రొస్తారే.. పాట పిక్చరైజేషన్, మహేష్ బాబు చెప్పే భారీ ఎమోషనల్ డైలాగ్స్ సినిమాకు ప్లస్ పాయింట్లంట. ఆకట్టుకోలేని కామెడీ, మందగించి నీరసంగా సాగే కథనంగమనం, సెకండాఫ్ అంతా రక్తసిక్తం కావడం మైనస్ పాయింట్లంట. ఇదంతా సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి అందిన సమాచారమట.
సినిమా విడుదల కాలేదు, కనీసం ప్రీమియర్ షో కూడా వేయలేదు... ఏమిటిదంతా అంటూ చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. మరి ఇది నిజంగా దుష్ప్రచారమా? లేక సినిమా యూనిట్ సభ్యులు లీక్ చేసిన వివరాలను బట్టి ఇలాంటి వార్తలు పుట్టుకొస్తున్నాయా? అనేది ఇంకా తేలాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











