బన్నీ రిలీజ్ , అల్లు వారింట హైడ్రామా .. టాలీవుడ్ స్టార్స్‌పై విమర్శలు..
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో పలు ప్రముఖ కుటుంబాలకి సంబంధించి ఒక హై టెన్షన్ వాతావరణం ఎలా నెలకొందో అందరికీ తెలిసిందే. మొదట మంచు వారి కుటుంబం నుంచి స్టార్ట్ అయ్యిన ఈ హై టెన్షన్ ఫ్యామిలీ డ్రామా ఆ తర్వాత అల్లు వారి స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరకు వచ్చింది. మరి అల్లు అర్జున్‌ని ఆకస్మికంగా హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి 12 గంటలు పాటు జైల్లో ఉంచి బయటకి రాకుండా చేయడం తెలుగునాట పెద్ద వార్తగానే నిలిచింది.
కాగా అక్కడి నుంచి పరిస్థితులు మరింత హీట్ ఎక్కాయి. అలా ఫైనల్‌గా పెద్ద సస్పెన్స్ నడుమ అల్లు అర్జున్ నిన్న ఉదయం విడుదల అయ్యారు. అయితే తాను అలా బయటకి వచ్చాడో లేదో తెలుగు ఇండస్ట్రీలో ఉన్న బిగ్ స్టార్స్ అంతా ఒకొక్కరిగా అల్లు అర్జున్ ని కలిసేందుకు క్యూకట్టారు. హీరోలు శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా, కమెడియన్ సుడిగాలి సుధీర్ వంటి వారు కూడా వచ్చారు.

అయితే తమ ఇండస్ట్రీకి సంబంధించి ఓ తోటి హీరోకి అలా జరగడం బాధాకరమే అని కలిశారు తప్పించి ఇదంతా ఒక హైడ్రామాలా మారిపోయింది అని కామెంట్స్ ఫిలింనగర్‌లో వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ ఏళ్ల తరబడి జైల్లో ఉండి వచ్చినట్టుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వార్తల్లో ఇదే హైలైట్ అయ్యింది. వందలాది కెమెరాలు లైవ్‌లు ఇవ్వడంతో పాటు హంగామా అల్లు వారి ఇంట జరిగింది.
ఇదంతా పలువురు నెటిజన్స్‌కి వెగటు పుట్టించేలా చేసింది అంటున్నారు. అల్లు అర్జున్ కోసం ఇంతమంది వచ్చారు సంతోషం కాదనలేదు. కానీ కేవలం అల్లు అర్జున్ కేవలం కొన్ని గంటలు జైల్లో ఉంటేనే ఇంతలా స్పందించారు కానీ అవతల సంధ్య థియేటర్ ఘటనలో ఒక ప్రాణం పోయింది, ఇంకొక పసి ప్రాణం కొన ఊపిరిలో కొట్టుకుంటుంది . కానీ ఈ అందరిలో ఎంతమంది ఆ కుటుంబం కోసం ఆలోచించారు? అంటూ విమర్శలు వస్తున్నాయి.
ఒక్క అల్లు అర్జున్ మాత్రమే వారి బాధ్యతలు తీసుకుంటానని చెప్పాడు. కానీ ఆ కుటుంబం కోసం మరే ఇతర హీరో కూడా మాట్లాడలేకపోయారు. ఇదెక్కడి న్యాయం అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. తనది మాత్రమే కుటుంబం సామాన్యులది కుటుంబం కాదా అంటూ టాలీవుడ్ స్టార్స్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మన దేశంలో పేద వాడికి ఒకలా .. డబ్బులు ఉన్న వారికి ఒకలా న్యాయం జరుగుతుంది అంటూ అల్లు అర్జున్ కేసు విషయంలో మరోసారి ప్రూవ్ అయ్యింది అని విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ నటించిన భారీ పాన్ ఇండియా సినిమా పుష్ప 2 మాత్రం థియేటర్స్‌లో సంచలన వసూళ్లతో దూసుకెళ్తుంది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications











