'తీన్ మార్' చిత్రంలో పాజిటివ్, నెగిటివ్ పాయింట్స్ విశ్లేషణ
పవన్ కళ్యాణ్, త్రిష కాంబినేషన్ లో జయంత్ రూపొందించిన తీన్ మార్ చిత్రం ఈ రోజు(గురువారం)విడుదలైంది. ప్రీమియర్ షో లతో ప్రారంభమైన ఈ చిత్రం టాక్ పాజిటివ్ గా ఉంది. అంతటా మంచి హిట్ టాక్ గా మరో ఖుషీగా అభివర్ణిస్తున్నారు. చిత్రంలో పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే...రిలీజ్ కు ముందే చిత్రంలో పాటలు అంతటా హిట్ టాక్ తెచ్చుకోవటం. అలాగే ఈ మధ్య కాలంలో ప్రతీ చిత్రానికి విడుదలకి ముందే నెగిటివ్ టాక్ వస్తోంది. అది ఈ చిత్రానికి లేకపోవటం. డైరక్టర్ త్రివిక్రమ్ పంచ్ డైలాగులు తో మళ్ళీ రైటర్ గా తన విశ్వరూపం ప్రదర్శించటం. పులితో పోలిస్తే బడ్జెట్ తక్కువ. వర్కింగ్ డేస్ కూడా చాలా తక్కువ. యావరేజ్ టాక్ వచ్చినా నిర్మాతకు లాభాలు వచ్చే మార్కిటింగ్ ప్లాన్.డెఫినెట్ గా ఎ సెంటర్స్ లో వర్కవుట్ అవుతుందనే నమ్మకం. ఆల్రెడీ హిందీ వెర్షన్ బ్లాక్ బస్టర్ కావటం. ట్రైలర్స్ కూడా చిత్రానికి మంచి క్రియేట్ చేయటం.
నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే...సినిమాపై విపరీతమైన ఎక్సపెక్టేషన్స్.దాంతో ఏ మాత్రం మంచి టాక్ రాకపోయినా ఇబ్బందుల్లో పడే అవకాశం.అలాగే ఎ సెంటర్లకే చిత్రం పరిమితం అనే టాక్ నిజమైతే బి,సి సెంటర్లలలో సినిమాకు కష్టమే.వీటికి తోడు జయంత్ పరాన్జీ చాలా గ్యాప్ తర్వాత ఈ చిత్రాన్ని రూపొందించటం.దాంతో ఎంతవరకూ నేటి ప్రేక్షకుడు పల్స్ పట్టగలడనే సందేహం.వీటికి తోడు సిద్దార్ధ బావ చిత్రంలో ఈ చిత్రంలో హైలెట్ అనుకునే ఎపిసోడ్ ని లేపేయటం తో జనాలు ఎంత వరకూ కొత్తగా ఫీలవుతారనేది ఆలోచించాల్సిన విషయం.
హైలెట్స్ విషయానికి వస్తే...పవన్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇక ఈ చిత్రం వెయ్యి ధియోటర్స్ లో ఒకే సారి విడుదల అవుతోంది. షూటింగ్ ని గతంలో ఏ పవన్ కళ్యాణ్ చిత్రానికి జరగనన్ని లొకేషన్స్ లో జరిగింది.ఖుషీ తర్వాత పవన్ లవర్ బోయ్ గా కనిపిస్తున్న చిత్రం ఇది.


Click it and Unblock the Notifications











