ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాలపై కుట్ర... కొన్నాళ్లుగా ఇదే పని?
తెలుగు సినిమాలను ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటేందుకు మన హీరోలు ఎంతలా కష్టపడుతున్నారో తెలిసిందే. టాలీవుడ్ నుంచి వచ్చే సినిమా అంటేనే తక్కువ చూపు చూసే స్థాయి నుంచి ఇండియాలో బాక్సాఫీస్ కలెక్షన్లలో మేజర్ పాత్రను పోషించే స్థాయికి చేరుకోవడం అనేది మాములు విషయం కాదు. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా తెలుగు సినిమాలకు క్రేజ్ పెరగడం మరీ గర్వించదగ్గ విషయం. ఇలా తెలుగు సినిమా మార్కెట్ ను విస్తరింపజేసేందుకు దర్శకులు, నిర్మాతలు, హీరోలు ఎంతగానో శ్రమిస్తున్నారు. భారీ ప్రాజెక్ట్స్ ను సెట్ చేస్తూ ఇంటర్నేషనల్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు.
ఇప్పటికే బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, పుష్ప2, సలార్, సాహో, వంటి చిత్రాలు ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేశాయో తెలిసిందే. అయితే ఇంత తెలుగు సినిమాను ముందుకు తీసుకెళ్లేందుకు దర్శకులు, నిర్మాతలు, హీరోలు ప్రయత్నిస్తుంటే.. ఓవైపు మనవాళ్లే మన సినిమాలను తొక్కేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారంట. సినిమా ప్రారంభం నుంచే మొదలు కొని ప్రమోషన్స్, బాక్సాఫీస్ క్లోజ్ అయ్యే వరకు సినిమాను తగ్గించడమే పనిగా పెట్టుకుంటున్నారంట. కొన్నాళ్లుగా ఇదే తంతు జరుగుతుందంట.

తాజాగా అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తేటతెల్లం చేశారు. ఆయన ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ సంచలనం విషయాలను వెల్లడించారు. మనవాళ్లే మన సినిమాలను తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. వారి పేర్లను చెప్పలేదు కానీ.. పలు సినిమాల మార్కెట్ ను తగ్గించేందుకు పీఆర్ టీమ్ తో చెలరేగిపోతున్నారని మండిపడ్డారు. వారి డబ్బులిచ్చి మరీ అదే పనిగా పక్కొడి సినిమాను తొక్కేస్తున్నారని తెలిపారు. లేటెస్ట్ గా విడుదలైన 'తండేల్'కు తను ఆ నెగెటివ్ ప్రచారాన్ని ఎదుర్కొన్నానని తెలిపారు.
అయితే.. నాగచైతన్య చెప్పిన మాటల ప్రకారం చూస్తే... కొన్నాళ్లుగా మహేశ్ బాబు ప్రతి చిత్రానికి, అలాగే జూనియర్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్ చిత్రాలకు ఇదే జరుగుతుందని పలువురు తమ గళాన్ని వినిపిస్తున్నారు. ఎంత చక్కటి సినిమా అయినప్పటికీ జనాదరణ లేకుండా ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారని కొందరు సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది విడుదలైన ఎన్టీఆర్ దేవర చిత్రానికి కూడా ఇదే జరిగిందని అభిమానులు వాపోతున్నారు.
ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు చిత్రాలన్నింటికీ యాంటీ ఫ్యాన్స్ మీదపడిపోతుంటారని, కావాలనే సినిమా రేంజ్ ను తగ్గించి సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇండస్ట్రీలో సౌమ్యుడనే మంచి పేరు తెచ్చుకున్న ప్రభాస్ సినిమాలకు కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడటం పట్ల అభిమానులు కూడా అప్సెట్ అవుతున్నారు. ఏదేమైనా ఇలాంటి పరిస్థితులు మారాలని, ప్రతి సినిమాను ఎంకరేజ్ చేసుకోవాలని, సందేశాత్మక చిత్రాలకు మరింతగా పోత్సాహం అందించాలని సినీ ప్రముఖులు, సినీ ప్రియులు కోరుకుంటున్నారు. ఇక మహేశ్ బాబు నెక్ట్స్ ఎస్ఎస్ రాజమౌళితో ఎస్ఎస్ఎంబీ29లో నటిస్తున్నారు. ప్రభాస్ భారీ ప్రాజెక్ట్స్ లతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ లైనప్ కూడా షాకింగ్ గానే ఉంది. రాబోయే చిత్రాలకైనా నెగెటివ్ ప్రచారం లేకుంటే బాగుంటుంది.


Click it and Unblock the Notifications











