»   » పవన్ కళ్యాణ్‌పై... యాంటీ ఫ్యాన్ గ్రూపు దుష్ప్రచారం

పవన్ కళ్యాణ్‌పై... యాంటీ ఫ్యాన్ గ్రూపు దుష్ప్రచారం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : టాలీవుడ్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోల్లో పవన్ కళ్యాణ్‌ను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఆయన సినిమా రిలీజవుతుందంటే సినిమా లోకంలో ఓ పండగ వాతావరణం ఏర్పడుతుంది. సినిమా హిట్టయినా...ఫట్టయినా మినిమమ్ లాభాలు వస్తాయనే ముద్ర పడిపోయింది.

ఆయన వ్యక్తిత్వం ప్రభావమో, లేక ఆయన చేసిన సినిమాల ప్రభావమో కచ్చితంగా చెప్పలేం కానీ......టాలీవుడ్లో పవన్ కళ్యాన్ ఓ పవర్ ఫుల్ స్టార్ అయ్యాడు. నిర్మాతలకు కలెక్షన్లు తెచ్చి పెట్టే ఖజానా అయ్యాడు. అయితే పవన్ కళ్యాణ్‌ను అభిమానించే వారు భారీ సంఖ్యలో ఉన్నట్లే.....ఆయనంటే ఇష్టపడని యాంటీ ఫ్యాన్ గ్రూపు కూడా ఒకటుందట.

తాజాగా పవన్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై కొన్ని రూమర్లు ప్రచారంలోకి రావడంతో....ఈ యాంటీ ఫ్యాన్ గ్రూపు వార్తల్లోకెక్కారు. వ్యక్తిగతంగా క్లీన్ ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్‌పై బురద చల్లేందుకే కొందరు ఆయనపై లేనిపోని వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆయన్ను అభిమానించే వారు అంటున్నారు.

తాజాగా పవన్ కళ్యాణ్ ఓ బ్రిటిష్ అమ్మాయితో కలిసి తిరుగుతున్నాడని, అతనికి ఆమెతో ఎఫైర్ ఉందని నెట్లో కొన్ని ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇదంతా యాంట్రీ ఫ్యాన్ గ్రూపు చేస్తున్న పనే అని, ఆయన ఫోటోలు మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. గతంలో 'తీన్ మార్' చిత్రం సమయంలోనూ పవన్ కళ్యాణ్ ఓ ఫారిన్ నటితో సంబంధం పెట్టుకున్నట్లు రూమర్లు వినిపించిన సంగతి తెలిసిందే.

English summary
Power star Pawan Kalyan's anti fan group created cheap Rumors against him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X