బికినీ ఫోటోలపై విమర్శలు, దిమ్మదిరిగే పంచ్ ఇచ్చిన హాట్ సింగర్!
దడ, ఊసరవెల్లి, నువ్వా నేనా, 1-నేనొక్కడినే, జై లవ కుశ లాంటి చిత్రాల్లో తన పాటలతో ఆకట్టుకున్న ముంబై సింగర్ నేహా భాసిన్.... తాజాగా బికినీ ఫోటో వివాదంలో ఇరుక్కుంది. తన హాలిడే ట్రిప్పులకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ అభిమానులను అలరించే నేహా బాసిన్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో టూ పీస్ బికిసీ ఫోటో ఒకటి పోస్టు చేసింది.
ఈ ఫోటోపై కొందరు అభిమానులు పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతూ చాలా అందంగా ఉన్నావంటూ ప్రశంసలు గుప్పించగా.... కొందరు ఆమె ఇలా బికినీ వేసుకోవడాన్ని విమర్శిస్తూ బూతు కామెంట్లు చేశారు. తన బికినీ ఫోటోపై అసభ్యంగా కామెంట్లు చేసిన వారికి ధీటైన సమాధానం ఇచ్చింది ఈ హాట్ సింగర్.
విమర్శకులకు సమాధానంగా మరో బికినీ ఫోటో పోస్టు చేసిన నేహా బాసిన్.... మహిళల డ్రెస్సింగ్, బికినీలపై మీ అభిప్రాయం మారే వరకు ఇలాంటి పోస్టులు పెడుతూనే ఉంటాను అని ఆమె వెల్లడించారు. నేహా బాసిన్ రియాక్ట్ అయిన తీరును అభిమానులు సైతం స్వాగతిస్తున్నారు.

2005లో బుల్లెట్ అనే బాలీవుడ్ సినిమా ద్వారా నేహా బాసిన్ ప్లే బ్యాక్ సింగర్‌గా కెరీర్ ప్రారంభించింది. హిందీ, తమిళం, తెలుగు, పంజాబీ ఇలా చాలా భాషల్లో పాటలు పాడింది. తెలుగులో ఆమె ఎక్కువగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన చిత్రాలకు పాటలు పాడారు.


Click it and Unblock the Notifications











