twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐటం బాంబుగా మారుతున్న హాట్ సింగర్

    By Bojja Kumar
    |

    సినిమా తెరవెనక ఎన్ని విభాగాలు ఉన్నప్పటికీ తెరపై కనిపించడంలో ఉన్న మజాయే వేరు. వెనక 10 సినిమాలకు పని చేసినా రాని గుర్తింపు, తెరపై ఒక్క సినిమాలో కనిపిస్తే బోలెడు పబ్లిసిటీ. ఇక హీరో, హీరోయిన్, ఐటం బాంబులకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే చాలా మంది తెర వెనక నుంచి తెరపైకి రావడానికి ప్రయత్నిస్తుంటారు. రవితేజ, నాని లాంటి వారు తొలుత తెర వెనక అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేసి తెరపైకి వస్తే...మమతా మోహన్ దాస్ తెర వెనక ప్లేబ్యాక్ సింగర్ గా ఆరంగ్రేటం చేసి హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పడు ఇదే తరహాలో మరో సింగర్ తెరపైకి రావడానికి ప్రయత్నిస్తోంది. కుదిరితే హీరోయిన్ గా, లేదా ఐటం గర్ల్ గా తన సత్తా చాటడానికి ప్రయత్నిస్తోంది.

    ఆ సింగర్ పేరు నేహా బాసిన్. ఇదివరకు ఓ తెలుగులో 'అటు నువ్వే ఇటు నువ్వే" అనే పాట పాడింది. తాజాగా జూనియర్ ఎఃన్టీఆర్ ఊసరవెల్లిలో 'నిహారిక" అనే సాంగును పాడింది. అంతే కాదు ఇటీవల జరిగిన ఊసరవెల్లి ఆడియో వేడుకలో తను పాడిన పాటకు పాటకు సెక్సీగా స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకుంది. ఇప్పటికే అమ్మడు చిట్టి పొట్టి నిక్కర్లేసుకుని దిగిన ఫోటోలను నెట్ లోకి వదిలింది. ఆ ఫోటోలు చూసైనా ఎవరైనా అవకాశం ఇవ్వక పోతారా అనేది ఆమె ఆలోచనగా కనిపిస్తోంది. మరి ఈ భామ కోరిక తీరెదెప్పుడో చూడాలి...

    English summary
    Neha Bhasin has sung 'Niharika' song in NTR starrer Oosaravelli. This sexy lady was present at the audio launch of this film and has set the stage on fire with her sizzling dance.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X