యేసు దాసుపై మండిపడింది

By Srikanya

ఇండోర్ : ప్రముఖ గాయకుడు కె.జె.యేసుదాసు చేసిన వ్యాఖ్యలుపై బాలీవుడ్ నటి నేహా ధూపియా మండిపడింది. ఆయన ఇటీవల మహిళల వస్త్ర ధారణకు సంభందించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో మహిళలను తక్కువ చేసినట్లే అని ఆమె ఆరోపించారు. 21 టోపాన్ కీ సలామీ చిత్రం ప్రమోషన్ కి ఇండోర్ వచ్చిన ఆమె మీడియా తో మాట్లాడుతూ యేసుదాసు మాట్లాడిన విధానాన్ని తప్పు పట్టారు.

నేహాధూపియా మాట్లాడుతూ...ఇది నిజంగా దురదృష్టం. మహిళలు ఏది ధరించాలి. ఏది ధరించకూడదు అని పేర్కొనటం సమాజానికే సిగ్గు చేటు. దేశం పురోగమనం సాధిస్తున్న ఈ దశలో ఈ వ్యాఖ్యలు ప్రముఖ స్దానంలో ఉన్న వ్యక్తి చేయటం చాలా బాధాకరం అన్నారు.

Neha Dhupia blasts KJ.Yesudas

అసలేం జరిగిందంటే... మహిళలు జీన్స్‌ వస్త్రాలు ధరించటంపై ప్రముఖ గాయకుడు కె.జె.యేసుదాస్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది భారతీయ సంస్కృతికి విరుద్ధమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్త్రీలు జీన్స్‌ వస్త్రాలు ధరించి ఇతరులకు ఇబ్బంది కలిగించరాదని, నిండుగా దుస్తులు ధరించాలని సూచించారు. గాంధీ జయంతి సందర్భంగా ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. నిరాడంబరత, స్నేహస్వభావం స్త్రీల గొప్ప గుణాలుగా భావించే భారతీయ సంస్కృతికి జీన్స్‌ వంటివి ధరించటం విరుద్ధమని వ్యాఖ్యానించారు.

మరో ప్రక్క మహిళలు జీన్స్‌ వేసుకోవడాన్ని తప్పు పట్టిన ప్రముఖ గాయకుడు జేసుదాస్‌పై కేరళలోని తిరువనంతపురం పోలీసుస్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. గురువారం గాంధీ జయంతి రోజున ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మహిళలు జీన్స్‌ వేసుకోవడంపై అభ్యంతరం తెలిపారు. ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ తిరువనంతపురంలో మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసన మార్చ్‌ నిర్వహించారు. గాయకుడిగా ఆయనను ఎంతో గౌరవిస్తున్నామని, కానీ మహిళల వ్యతిరేక వ్యాఖ్యలు ఆయన నుంచి రావడం దురదృష్టకరమని వారు పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X