కాలేజీలో కండోమ్ పాకెట్స్ విసిరిన తార
అవును..నేను కండోమ్ ల ప్యాకెట్ ను ప్యాకెట్ ను స్టూడెంట్స్ మధ్యకు విసిరాను..అయితే అది వారిని ఎడ్యుకేట్ చేయటానికే..అయితే మరో విధంగా మా లేటెస్ట్ చిత్రం ప్రమోషన్ కోసం కూడా అంది నేహా ధూపియా. ఆమె తాజాగా ముంబయిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన మూడ్ ఇండిగో ఫెస్టివల్‌కు హాజరైంది. నేహాధూపియాతోపాటు "రాత్ గయి బాత్ గయి" చిత్రం నిర్మాత కూడా ఆ ఉత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమం జరుగుతుండగా హఠాత్తుగా ఆమె విద్యార్థుల మధ్యలోకి కండోమ్ ప్యాకెట్లు విసిరేసి సంచలనం సృష్టించింది. నేహా విసిరిన కండోమ్ ప్యాకెట్లను చూసి విద్యార్థులు షాకై పోయారు.
అయితే అదంతా నిర్మాత ఆలోచన అని తర్వాత చెప్పింది. కార్యక్రమం జరుగుతున్నప్పుడు "రాత్ గయి బాత్ గయి" నిర్మాత ఓ పెద్ద సంచీలో కండోమ్‌లు, సిరంజిలు, డిస్పెన్సరీ సామగ్రిని తీసుక వచ్చి తన సినిమా ప్రమోషన్‌లో భాగంగా వాటిని విద్యార్థుల మధ్యకు విసిరేయాల్సిందిగా నేహా ధూపియాను కోరాడు. మొదటి నిరాకరించినా తర్వాత సినిమా ప్రమోషన్ కోసం ఏదైనా చెయ్యాల్సిందే అన్నాడు..నాకు సబబే అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత మీడియాతో అలా ఎందుకు చేసారన్నదానికి సమాధానం కూడా అలాగే చెప్పింది. ఏ ఉత్పత్తినైనా మార్కెట్ చేసుకోవడానికి తయారీదారులు రకరకాల మార్గాలను అన్వేషిస్తారు. మా నిర్మాత ఈ మార్గాన్ని ఎన్నుకున్నారు కనుక దానిని తను అమలు పరచానని చెప్పింది నేహా ధూపియా.


Click it and Unblock the Notifications











