పెళ్లికి ముందే గర్భం, హీరోయిన్‌కు మద్దతుగా ఫ్యాన్స్... శ్రీదేవి కాలం నుంచే కామన్!
బాలీవుడ్ నటి నేహా ధూపియా ఇటీవల ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆమె ప్రియుడు అంగద్ బేడీని ఆమె మే నెలలో రహస్యంగా పెళ్లాడారు. పెళ్లికి రెండు మూడు నెలల ముందే ఈ హాట్ బ్యూటీ గర్భం దాల్చిందనే వార్తలు సైతం పెళ్లి తర్వాత వినిపించాయి.
Recommended Video

బిడ్డ పుట్టడానికి కొన్ని రోజుల ముందు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అంగద్ బేడీ అసలు విషయాన్ని ఒప్పుకున్నారు. తన భార్య పెళ్లికి ముందే గర్భం దాల్చిందని, ఈ విసషయం ఇంట్లో చెప్పిన తర్వాత చివాట్లు పెట్టారని, ఆ తర్వాత పెళ్లి చేసుకుకున్నామని స్పష్టం చేశారు.
అయితే ఇష్యూపై సోషల్ మీడియాలో కొందరు నెగెటివ్ కమెంట్స్ చేస్తూ దీన్ని తప్పుబడుతున్నారు. అయితే నేహా ధూపియాకు కొందురు తమ మద్దతు తెలుపుతున్నారు. ఈ రోజుల్లో ఇవన్నీ కామన్... సారిక, శ్రీదేవి కాలం నుంచే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతున్నాయనే అభిప్రాయాలు వారి నుంచి వ్యక్తం అవుతున్నాయి.

నేహా ధూపియా-అంగద్ బేడీ
నేహా ధూపియా, అంగద్ బేడీ దంపతులు ఆదివారం ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. మే 10న పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకన్నారు. అప్పటికే నేహా 2 నెలల గర్భవతి.

శ్రీదేవి-బోనీ కపూర్
హీరోయిన్ శ్రీదేవి నిర్మాత బోనీ కపూర్‌ను రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందే బోనీ కపూర్ కారణంగా శ్రీదేవి గర్భవతి అయింది. పెళ్లయ్యే నాటికి శ్రీదేవి 7 నెలల గర్బవతి.

పవన్-రేణూ
హీరోయిన్ రేణు దేశాయ్ తెలుగు యాక్టర్ పవన్ కళ్యాణ్‌తో సహజీవనం చేసిన విషయం తెలిసిందే. పెళ్లి ముందే వీరు అకీరాకు జన్మనిచ్చారు. ఆ తర్వాత వీరు పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ విడిపోయిన సంగతి తెలిసిందే.

కొంకనా సేన్ శర్మ
బాలీవుడ్ నటి కొంకణా సేన్ తన ప్రియుడు రణవీర్ షోరేను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి జరిగే నాటికి ఆమె 6 నెలల గర్భవతి.

మరో హీరోయిన్ కూడా
బాలీవుడ్ హీరోయిన్ మహిమా చౌదరి కూడా పెళ్లి ముందే గర్భవతైనట్లు వార్తలు వచ్చాయి.

అనౌష్క్ శంకర్
ప్రముఖ సితార్ కళాకారుడు రవి శంకర్ కుమార్తె అయిన అసౌష్క శర్మ తన బాయ్ ఫ్రెండ్, బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ జియో రైట్ వల్ల పెళ్లికి ముందే గర్భం దాల్చారు.

కమల్ హాసన్- సారిక
శ్రీదేవి మాదిరిగా నటి సారిక కూడా కమల్ హాసన్‌ను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ వల్ల సారిక పెళ్లికి ముందే గర్భవతి అయ్యారు. అలా కలిగిన సంతానమే శృతి హాసన్.

అమృతా అరోరా
ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ అమృతా అరోరా...తన బాయ్ ఫ్రెండ్ షకీల్ లడక్‌ను పెళ్లాడటానికి కారణం ఆమె పెళ్లికి ముందే గర్భవతి కావడం అనే రూమర్స్ అప్పట్లో వినిపించాయి.

సెలీనా జైట్లీ
మరో బాలీవుడ్ హీరోయిన్ సెలీనా జైట్ల కూడా పెళ్లికి ముందే గర్భవతి అయింది. ఆ తర్వాత తన బాయ్ ఫ్రెండ్ పీటర్ హాగ్‌ను పెళ్లాడి ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది.


Click it and Unblock the Notifications











