బాలీవుడ్ హాట్ గర్ల్ గా రామ్ చరణ్ హీరోయిన్ కి జేజేలు..
చరణ్ సరసన 'చిరుత" సినిమాలో హీరోయిన్ గా నటించిన నేహా శర్మ, ప్రస్తుతం బాలీవుడ్ లో హాటెస్ట్ హీరోయిన్. 'క్రూక్" సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోన్న నేహా శర్మ, తొలి సినిమా ఇంకా విడుదల కాకముందే, బాలీవుడ్ దర్శక నిర్మాతల్ని విశేషంగా ఆకట్టుకుందిట. ప్రస్తుతం, తన చేతిలో నాలుగైదు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ వున్నాయనీ, 'క్రూక్" సినిమా బాలీవుడ్ బాక్సాపీస్ ని షేక్ చేయడం ఖాయమని చెబుతోంది నేహా శర్మ. కాగా, నేహా శర్మ కోసం బాలీవుడ్ లో పలువురు యువ హీరోలు అప్పుడే ఎంక్వయిరీలు కూడా మొదలు పెట్టేశారట.
'చిరుత" సినిమా తర్వాత తెలుగులో వచ్చిన 'కుర్రాడు" తో నేహా శర్మ టాలీవుడ్ నుంచి ఔట్ అయిపోయినా, అమ్మడికి బాలీవుడ్ తో అవకాశాలు బాగానే వస్తున్నాయన్నమాట. అయితే మరి 'క్రూక్" తో 'చిరుత" పోరీ నేహా శర్మ బాలీవుడ్ లో హాటెస్ట్ హీరోయిన్ అన్సించుకుంటుందో లేదో ...
రామ్ చరణ్ తేజ్ నేహా శర్మ చిరుత కుర్రాడు క్రూక్ వరుణ్ సందేష్ ram charan teja neha sharma chiruta kurradu crook varun sandesh


Click it and Unblock the Notifications