»   » రామ్ చరణ్ హీరోయిన్ అంతలా ఎక్సపోజ్ చేసిందా?

రామ్ చరణ్ హీరోయిన్ అంతలా ఎక్సపోజ్ చేసిందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగులో రామ్ చరణ్ తేజ్ సరసన 'చిరుత'లో, వరుణ్ సందేశ్‌కి జోడీగా 'కుర్రాడు'లో నటించిన నేహా శర్మ ఆ తర్వాత ఆఫర్స్ సంపాదించుకోలేకపోయింది. అయితే ఇప్పుడు బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది. బాలీవుడ్‌లో ఆమె తొలి సినిమా హీరో కిస్సుల కింగ్ ఇమ్రాన్ హష్మి సరసన చేసింది. మహేశ్ భట్, ముఖేష్ భట్ ‌కు చెందిన విశేష్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఆ సినిమా పేరు 'క్రూక్ - ఇట్స్ గుడ్ టు బి బాడ్'. మోహిత్ సూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో 'ఫ్యాషన్' ఫేమ్ అర్జన్ బజ్వా మరో కీలక పాత్ర చేసారు. ఇక దర్సకుడు ఈ సినిమాని రొమాంటిక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దారు. విదేశాల్లోని, ముఖ్యంగా ఆస్ట్రేలియాలోని భారతీయులపై జరుగుతున్న జాతి వివక్ష దాడుల నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. అక్టోబర్ 8న ఈ సినిమాని విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇక మోహిత్ సూరి గతంలో జెహర్,కలియుగ్, వా లంహే, ఆవారాపన్, రాజ్ సీక్వెల్ చిత్రాలు డైరక్ట్ చేసారు. హీరోయిన్స్ ని సెక్సీగా చూపటంతో సినిమాలు ప్లాప్ అయినా కలెక్షన్స్ కు ఎప్పుడూ సమస్య రాలేదు. ఇక ఈ చిత్రంలోనూ నేహాశర్మ ఓ రేంజిలో ఎక్సపోజ్ చేసి సెక్సీగా చూపాడని, అదే హైలెట్ అనీ బాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu