Don't Miss!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Travel ఐఆర్సిటీసి వారి హైదరాబాద్ టు అహ్మదాబాద్ 8 రోజుల ట్రైన్ టూర్ ప్యాకేజీ...
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
దుస్తులిప్పేసి చేయడం బాగా లేదంటున్న భామ
ముంబై: ఇంటిమేట్ సీన్స్ చేయడం తాను మానేస్తానని, దుస్తులిప్పిసి ప్రేమ సన్నివేశాల్లో నటించడం నచ్చడం లేదని నటి నేహా శర్మ అంటోంది. త్వరలో రానున్న జయంతభాయ్ కి లవ్ స్టోరీలో చేసిన ఇంటిమేట్ సీనే తనకు చివరిదని ఆమె చెప్పింది. ఈ సినిమాలో నేహా శర్మ వివేక్ ఒబెరాయ్ సరసన నటిస్తోంది. దుస్తులు విప్పిస్తూ నటించడం సౌకర్యంగా అనిపించడం లేదని ఆ భామామణి వాపోయింది.
స్క్రిప్టునకు అవసరమైన మేరకు ఇంటిమేట్ సీన్స్ కొంత మేరకు అవసమేనని, అయితే అలా చేయడం తనకు నచ్చడం లేదని అన్నది. ఈ సినిమాలో నేహా శర్మ మధ్యతరగతి అమ్మాయిగా నటిస్తోంది. తన కలలను సాకారం చేసుకోవడానికి ముంబై చేరే అమ్మాయి పాత్ర అది. వివేక్ ఒబెరాయ్ గ్యాంగ్స్టర్గా నటిస్తున్నాడు.
పరిశ్రమలో నిలబడాలంటే చాలా ఓపిక కావాలని, కుటుంబానికి సినీ నేపథ్యం లేకుపోతే ప్రతి సినిమాకు పోరాటమే చేయాల్సి ఉంటుందని, కొత్త ఆఫర్లకు కూడా పోరాటం తప్పదని నేహా శర్మ అంది. సినిమాలను ఎంపిక చేసుకునే విషయంలో ఎంతో జాగ్రత్త అవసరమని అభిప్రాయపడింది. కొన్ని సార్లు చాలా కాలం నిరీక్షించాల్సి వస్తుందని, తాను నిలదొక్కుకోగలననే నమ్మకం ఉందని ఆ తార చెప్పింది.
నేహా శర్మ తర్వాతి చిత్రం యమ్లా పగ్లా దీవానా 2. ఈ సినిమాలో ధర్మేంద్ర, సన్నీ, బాబీ డయోల్ నటిస్తున్నారు. లెజెండరీ ధర్మేంద్రతో నటించడం తనకు గౌరవమని ఆమె చెప్పుకుంది. వారంతా మంచి నటులని, మంచి మనుషులని, వారితో నటించడం తనకు ఆనందంగా ఉంటుందని నేహా శర్మ చెప్పింది.