twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దుస్తులిప్పేసి చేయడం బాగా లేదంటున్న భామ

    By Pratap
    |

    ముంబై: ఇంటిమేట్ సీన్స్ చేయడం తాను మానేస్తానని, దుస్తులిప్పిసి ప్రేమ సన్నివేశాల్లో నటించడం నచ్చడం లేదని నటి నేహా శర్మ అంటోంది. త్వరలో రానున్న జయంతభాయ్ కి లవ్ స్టోరీలో చేసిన ఇంటిమేట్ సీనే తనకు చివరిదని ఆమె చెప్పింది. ఈ సినిమాలో నేహా శర్మ వివేక్ ఒబెరాయ్ సరసన నటిస్తోంది. దుస్తులు విప్పిస్తూ నటించడం సౌకర్యంగా అనిపించడం లేదని ఆ భామామణి వాపోయింది.

    స్క్రిప్టునకు అవసరమైన మేరకు ఇంటిమేట్ సీన్స్ కొంత మేరకు అవసమేనని, అయితే అలా చేయడం తనకు నచ్చడం లేదని అన్నది. ఈ సినిమాలో నేహా శర్మ మధ్యతరగతి అమ్మాయిగా నటిస్తోంది. తన కలలను సాకారం చేసుకోవడానికి ముంబై చేరే అమ్మాయి పాత్ర అది. వివేక్ ఒబెరాయ్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నాడు.

    పరిశ్రమలో నిలబడాలంటే చాలా ఓపిక కావాలని, కుటుంబానికి సినీ నేపథ్యం లేకుపోతే ప్రతి సినిమాకు పోరాటమే చేయాల్సి ఉంటుందని, కొత్త ఆఫర్లకు కూడా పోరాటం తప్పదని నేహా శర్మ అంది. సినిమాలను ఎంపిక చేసుకునే విషయంలో ఎంతో జాగ్రత్త అవసరమని అభిప్రాయపడింది. కొన్ని సార్లు చాలా కాలం నిరీక్షించాల్సి వస్తుందని, తాను నిలదొక్కుకోగలననే నమ్మకం ఉందని ఆ తార చెప్పింది.

    నేహా శర్మ తర్వాతి చిత్రం యమ్లా పగ్లా దీవానా 2. ఈ సినిమాలో ధర్మేంద్ర, సన్నీ, బాబీ డయోల్ నటిస్తున్నారు. లెజెండరీ ధర్మేంద్రతో నటించడం తనకు గౌరవమని ఆమె చెప్పుకుంది. వారంతా మంచి నటులని, మంచి మనుషులని, వారితో నటించడం తనకు ఆనందంగా ఉంటుందని నేహా శర్మ చెప్పింది.

    English summary
    Actress Neha Sharma says that her intimate scene in upcoming film "Jayantabhai Ki Luv Story", co-starring Vivek Oberoi, will be her first and last on-screen. The 25-year-old actress said that she will not do a lovemaking scene in the future as she is not comfortable shedding off her clothes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X