రామ్ చరణ్ హీరోయిన్ లాంటి అందగత్తెను నేనింతవరకూ చూడలేదు..!
చిరుత సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చి, కుర్రాడు"తో తెలుగు తెరనుంచి మాయమైపోయిన హీరోయిన్ నేహాశర్మ, బాలీవుడ్ 'క్రూక్" సినిమాలో ఇమ్రాన్ హష్మీ సరసన నటించిన సంగతి విదితమే. 'క్రూక్" సినిమాలో ఇమ్రాన్ తో కలిసి నటించడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్ అని ఇమ్రాన్ హష్మీ చెబుతోంటే, నేహాశర్మలాంటి అందగత్తెను తానింతవరకూ చూడలేదని ఇమ్రాన్ హష్మీ చెబుతున్నాడు. అందగత్తె మాత్రమే కాదు, నేహాశర్మ మంచి నటి..అని కితాబులిచ్చేస్తోన్న ఇమ్రాన్ హష్మీ, బాలీవుడ్ నేహాశర్మకు మంచి భవిష్యత్ వుందని జోస్యం చెబుతున్నాడు.
నేహాశర్మ కోసమే ఇమ్రాన్ హష్మి, తెలుగులో వచ్చిన 'చిరుత" సినిమా డీవీడి తెప్పించుకుని మరీ చూశాడట. ఎలాగైతేనేం..గాడ్ ఫాదర్ లేకుండా బాలీవుడ్ లో ఎదగడం కష్టమే కనుక, ఆ లోటు ఇమ్రాన్ హష్మీ రూపంలో నేహాశర్మకు తీరిందనే అంటున్నారు బాలీవుడ్ జనం.
నేహాశర్మ ఇమ్రాన్ హష్మీ చిరుత క్రూక్ రామ్ చరణ్ తేజ్ neha sharma emraan hashmi crook chirutha ram charan teja


Click it and Unblock the Notifications