చిరుత సినిమాతో పరిచయమైన నేహా శర్మ ఇప్పుడు వి.వి.వినాయిక్,ఎన్టీఆర్ కాంబినేషన్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పడామెకి వరుణ్ సందేశ్ ప్రక్కన మరో ఆఫర్ వచ్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. తమిళ హిట్ పొల్లాదవాన్ ఆధారంగా తయారవుతున్న యాక్షన్ చిత్రంలో వరుణ్ సరసన ఆమె అయితే బాగుంటుందని దర్శకుడు సందీప్ రెడ్డి భావించినట్లు సమాచారం. నిర్మాత జెమిని కిరణ్ కూడా వారు కూడా గో ఎ హెడ్ అని అన్నట్లు చెప్తున్నారు. ఇక ఈ సినిమాను తమిళంలో ధనుష్ చేసాడు. ప్రస్తుతం వరుణ్ ..ఎవియం వారు నిర్మిస్తున్న ఎప్పుడైనా,ఎక్కడైనా ప్రేమలో పడొచ్చు అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ సినిమాలో చేస్తున్న ఆమె ఈ రెండు సినిమాలూ హిట్టయితే తెలుగులో సెటిలయినట్లే అంటున్నారు. ఇక ఎన్టీఆర్ సినిమాలో మరో హీరోయిన్ గా నయనతార చేస్తోంది.