»   » చరణ్ హీరోయిన్ ఆరాటం: సెక్సీ ఇమేజ్ కోసమే ఇలా...(హాట్ ఫోటోస్)

చరణ్ హీరోయిన్ ఆరాటం: సెక్సీ ఇమేజ్ కోసమే ఇలా...(హాట్ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ మొదటి సినిమా 'చిరుత' సినిమాలో నటించిన నేహా శర్మ గుర్తుందా?... ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లయినా పట్టుమని పది సినిమా అవకాశాలు కూడా దక్కించుకోలేని ఈ బ్యూటీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తోంది.

తొలి సినిమా 'చిరుత' తర్వాత పలు బాలీవుడ్ సినిమాల్లో నటించినా... ఒక్క సినిమా కూడా ఆమెకు సరైన బ్రేక్ ఇవ్వలేక పోయింది. ఆశించిన స్థాయిలో అవకాశాలు లేక పోయినా... ఏ మాత్రం నిరాశ చెందకుండా ముందుకు సాగుతోంది.

జిక్యూ మేగజైన్

జిక్యూ మేగజైన్

సెక్సీ ఇమేజ్ సొంతం చేసుకుంటే తప్ప ఇండస్ట్రీలో నిలదొక్కునే పరిస్థితి లేక పోవడంతో ఈ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా జిక్యూ మేగజైన్ మార్చి 2017 సంచిక కోసం నేహా శర్మ హాట్ అండ్ సెక్సీగా ఫోజులు ఇచ్చింది.

బ్యాగ్రౌండ్ లేకనే

బ్యాగ్రౌండ్ లేకనే

బాలీవుడ్‌లో ఎప్పట్నుంచో నటిస్తున్నా కానీ ఇంకా తనకి అక్కడ సరైన గుర్తింపు రాలేదని, బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా నిలబడాలంటే చాలా కష్టమని నేహా శర్మ వాపోతోంది. బ్యాక్‌గ్రౌండ్‌ బాగున్న హీరోయిన్లకయితే ఎన్ని ఫ్లాప్స్‌ వచ్చినా అవకాశాలు వస్తాయని, కానీ తాను ఇప్పటికీ ఆడిషన్స్‌కి వెళ్లి ఆఫర్స్‌ దక్కించుకుంటున్నానని, ఇప్పటికీ ఫోటో ఆల్బమ్‌ చేత్తో పట్టుకుని ఆఫీసుల వెంట తిరుగుతున్నానని అంటోంది.

రూమర్స్

రూమర్స్

చిరుత విడుదలైన మొదట్లో తనకు మరో హీరోతో లింకులు పెడుతూ కొందరు వార్తలు రాయడాన్ని చూసినప్పుడు చాలా బాధపడ్డాననీ, అయితే ఆ తర్వాత నిదానంగా ఆలోచించి గాసిప్స్‌ వల్ల ఏం జరుగుతోందన్న విషయాన్ని తెలుసుకున్నాను, ఇపుడు అలాంటి పట్టించుకోవడం లేదు అంటోంది. అప్పట్లో రామ్ చరణ్ తో ఆమె లవ్ ఎఫైర్ నడుపుతోందని వార్తలు వచ్చాయి.

వాటి వల్లే గుర్తింపు

వాటి వల్లే గుర్తింపు

గాసిప్, రూమర్స్ మనపై ఎంతగా ప్రచారంలోకి వస్తే సినీ పరిశ్రమలోని వారికి గుర్తింపు వస్తుంది, ఇలాంటివి సెలబ్రెటీల జీవితాల్లో చాలా చాలా కామన్, నా విషయంలో కూడా రూమర్స్ మొదలయ్యాకే తనకు గుర్తింపు వచ్చినట్లు భావించానంటోంది నేహా శర్మ.

పొలిటికల్ బ్యాగ్రౌండ్

పొలిటికల్ బ్యాగ్రౌండ్

నేహా వర్మకు పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉంది. నేహా తండ్రి బీహార్ లోని భగల్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే. నేహా మాత్రం తనకు ఇష్టమైన సినిమా రంగంలో కొనసాగుతూ తన ప్రయత్నాలు తాను చేస్తోంది.

సినిమాలు

సినిమాలు

ప్రస్తుతం నేహా శర్మ ‘ముబారకన్' అనే హిందీ మూవీలో నటిస్తోంది. అనీస్ బజ్మి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నేహా శర్మతో పాటు అనిల్ కపూర్, అర్జున్ కపూర్, ఇలియానా, అథియా శెట్టి, పవన్ మల్హోత్రా, రత్న పాథక్ నటిస్తున్నారు.

English summary
Neha Sharma on cover page Photoshoot for GQ India Magazine March 2017 Issue. Neha Sharma last seen Tum Bin 2 , a sequel to the 2001 film Tum Bin. Her next movie is Mubarakan,an upcoming Indian romantic comedy film, written and directed by Anees Bazmee , and she will play the leading role along with Anil Kapoor, Arjun Kapoor, Ileana D’Cruz and Athiya Shetty.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu