పాలసీసాతో మందు పట్టిస్తున్న ప్రేయసి.. తాగుబోతుకు భలే జోడి .. డోస్ పెంచిన 90 ml
టాలీవుడ్‌లో ఓ చిత్రమైన పరిస్థితి కనిపిస్తున్నది. తమ సినిమాను ప్రమోట్ చేసుకోవడంలో కొందరు విఫలమవుతున్నారు. సినిమాలో కంటెంట్ ఉందా లేదా అన్నది సెకండరి ఇష్యూ అయిన ఈ తరుణంలో.. సినిమాపై అందరి దృష్టి పడేలా చేయగలగాలి. అందుకే కొందరు తమ సినిమాను కొత్త పద్దతుల్లో ప్రమోట్ చేస్తుంటారు. సినిమాలోని కంటెంట్ను కొత్త రకంగా ప్రొజెక్ట్ చేస్తూ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యేలా చూడాలి. తాజాగా కార్తీకేయ నటించిన 90 Ml సినిమా మాత్రం ప్రమోషన్‌లో దూసుకెళ్తున్నది. ఈ ప్రమోషన్ గురించి వివరాల్లోకి వెళితే..

హిప్పీతో నిరాశపరిచినా.. గుణ 369తో హిట్టు కొట్టాడు..
ఆర్ఎక్స్ 100 సినిమాతో దూసుకుపోయిన హీరో కార్తికేయ.. యూత్ ఫుల్ ఫాలోయింగ్ ఏర్పర్చుకున్నాడు. ఆ తరువాత హిప్పీ అంటూ పలకరించినా.. అంతగా సక్సెస్ కాలేకపోయాడు. మళ్లీ గుణ 369 అంటూ ట్రై చేసి హిట్టు కొట్టాడు. తాజాగా విలన్ పాత్రలను ఒప్పుకుని.. నాని గ్యాంగ్ లీడర్ చిత్రంలో చక్కని నటనను కనబరిచాడు. మళ్లీ మరో డిఫరెంట్ మూవీతో మన ముందుకు రానున్నాడు.

పాలసీసాలో మందు..
చిన్నతనంలో అందరూ పాలసీసాలో పాలు తాగి పెరుగుతారు. అయితే అదే పాలసీసాలో మందు తాగుతూ ఉన్నాడంటే.. అతనికి మందులో ఏదో లింక్ ఉండే ఉంటుంది. ఇదే పాయింట్ ను జనాల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రమోట్ చేస్తున్నారు 90ఎమ్ఎల్ చిత్రయూనిట్. అయితే ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ సినిమాపై బజ్ క్రియేట్ చేసింది.

90ఎమ్ఎల్ టీజర్తో అంచనాలు పెంచేశాడు..
డీజీల్‌తో నడిచే బండ్లను చూసుంటావ్.. పెట్రోల్తో నడిచే బండ్లను చూసుంటావ్.. కానీ ఇది లిక్కర్తో నడిచే బండి.. గుద్దితే అడ్రస్ ఉండదు అంటూ కార్తికేయ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. మాస్ ఎంటర్టైనర్‌గా తెరెకెక్కుతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి.

హీరోకు సరైన జోడు ‘సువాసన’
ఇలాంటి తాగుబోతుకు సరైన జోడి అంటూ సువాసన (నేహా సోలంకి) పాత్రను పరిచయం చేస్తూ.. ఓ పోస్టర్ను రిలీజ్ చేశారు. ప్రియురాలి ఒళ్లో పడుకుని ఉండగా.. పాలసీసాతో మందును పడుతూ ఉన్న ఆ పోస్టర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. మరి ఈ చిత్రంలో ఏదో కొత్త పాయింట్ ఉండబోతోందనేది స్పష్టమవుతోంది. మరి అదేంటన్నది తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











