twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దిగంబరంగా ఆ హీరో

    By Staff
    |

    Neil Nitin Mukesh
    పేజ్ త్రి, ప్యాషన్, ట్రాఫిక్ సిగ్నల్ చిత్రాల మధుర్ బండార్కర్ తాజాగా నిర్మిస్తున్న జైల్ చిత్రంలో నీల్ నితిన్‌ ముఖేశ్‌ దిగంబరంగా కనిపించనున్నారు. జైళ్లలో మగ్గే జీవిత ఖైదీల జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. అందుకోసమే హీరో బట్టలు లేకుండా కొన్ని సన్నివేశాల్లో చేయాల్సి వచ్చింది. జైళ్ళలో ఎంత కిరాతకంగా ఖైదీల్ని వేధిస్తారో చూపటానికి వాస్తవ పరిస్ధితులను దర్పణం చేయటానికి ఇలాంటి సన్నివేశాలు అవసరమని మధూర్ అభిప్రాయపడ్డారు.

    ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.."దేశంలోని వివిధ జైళ్లలో పరిస్థితుల్ని పరిశీలించిన తరవాత నీల్‌తో దిగంబరంగా కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించాం. వీటిని చూసిన తరవాత అసభ్యకరంగా ఉన్నాయని ఎవరూ అనరు. ఎందుకంటే వాస్తవిక కోణంలో ఈ సన్నివేశాలు దర్శనమిస్తాయి. అశ్లీలత ఎంత మాత్రమూ కనిపించదని" అన్నారు. ఇక నీల్ ఈ సన్నివేశాల్లో చేయటానికి ఒప్పుకోవటానికి జాన్ అబ్రహం కారణమని తెలుస్తోంది. ఎందుకంటే జాన్ కూడా 'న్యూయార్క్‌' పేరుతో తెరకెక్కుతున్న మరో చిత్రంలో దిగంబరంగా నటించారని సమాచారం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X