‘నేల టిక్కెట్టు’ కేవలం ఆ కేటగిరీ సినిమా కాదు: ఫిల్మీబీట్ ఇంటర్వ్యూలో కళ్యాణ్ కృష్ణ
Recommended Video

రవితేజ హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'నేల టిక్కెట్టు' మే 25న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రవితేజ నుండి అభిమానులు ఎక్స్‌పెక్ట్ చేస్తున్న అన్ని అంశాలు ఇందులో ఉంటాయన్నారు. రవితేజ మార్క్ కామెడీతో పాటు, ఆయనలో ఉండే ఫైర్ ఈ చిత్రంలో ఉంటుందన్నారు. చుట్టూ జనం మధ్యలో మనం అనేది సినిమా మెయిన్ పాయింట్.... అన్నారు.

సినిమా కథ గురించి...
మన చుట్టూ ఫ్యామిలీతో పాటు మనం ఇష్టపడే వ్యక్తులు ఉన్నపుడే హ్యాపీగా ఉంటాం. కొంత మందికి జనంతో ఉండటం ఇంకా ఇష్టం ఉంటుంది. అటువంటి క్యారెక్టర్ హీరోది. మనం హ్యాపీగా ఉండాలంటే మన చుట్టూ మనుషులు ఉండాలి. డబ్బు అవసరమే. అదే సమయంలో మనుషులతో మంచి సంబంధాలు కూడా ఎంతో ముఖ్యం. మనుషులు మన మధ్య ఉన్నపుడు వారి వ్యాల్యూ తెలియదు. వారు దూరం అయిన తర్వాతే వారి విలువ తెలుస్తుంది. ఈ పాయింటునే మెయిన్‌గా ఫోకస్ చేస్తూ ఒక సోషల్ మెసేజ్‌గా దీన్ని చూపించబోతున్నామని కళ్యాణ్ కృష్ణ తెలిపారు.

కేవలం ఆ కేటగిరీ సినిమా కాదు
‘నేల టిక్కెట్టు' అనగానే పక్కా మాస్ కేటగిరీ సినిమా అని ఫిక్స్ అయ్యారు. కానీ ఇది వంద శాతం ఫ్యామిలీ మూవీ. రాబోయే తరాలకు వ్యాల్యూస్ నేర్పించే సినిమా. ఈ సినిమా వల్ల ఏదో మారిపోతుందని కాదు. కానీ పెద్దవాళ్లకు, పేరెంట్స్ రెస్పెక్ట్ ఇవ్వాలనే ఒక ఆలోచన కలుగుతుంది.... అని కళ్యాణ్ కృష్ణ తెలపారు.

10 శాతం మందికి నెక్ట్ అయినా సక్సెస్ అయినట్లే
డబ్బుకంటే ఇంపార్టెంట్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అనేది ఈ సినిమాలోని మెయిన్ కాన్సెప్ట్. సినిమాలోని ఈ పాయింట్ ఎక్కడో ఒక చోట 10 శాతం జనాలకు కనెక్ట్ అయినా చాలు నేను సక్సెస్ అయినట్లే.... అని దర్శకుడు తెలిపారు.

రవితేజ నాలో ఆత్మస్థైర్యాన్ని పెంచాడు
ఆడియో రిలీజ్ వేడుకలో రవితేజ గురించి మాట్లాడి ఎమోషన్ అవ్వడంపై కళ్యాణ్ కృష్ణ స్పందిస్తూ... ఇంతకు ముందు ఓ ప్రాజెక్ట్ కోసం నాలుగేళ్లు పని చేశాను. అయితే వేరే కారణాల వల్ల ఆ సినిమా మొదలు కాలేదు. ఆ సమయంలో రవితేజను కలిశాను. ఆయనకు నేల టికెట్ స్టోరీ చెప్పాను. కథ నచ్చి తప్పకుండా చేస్తాను అని మాటిచ్చారు. అయితే అప్పటికే ఆయనకు కొన్ని కమిట్మెంట్లు ఉండటంతో కొంత కాలం వెయిట్ చేయి, ఈలోపు ఏమైనా ఛాన్స్ వస్తే వదలకుండా చేయ్ అని భరోసా ఇచ్చారు. ఆ సమయంలో రవితేజ చెప్పిన మాటలు నాలో ఆత్మస్థైర్యాన్ని పెంచాయి అని కళ్యాణ్ కృష్ణ తెలిపారు.
సోల్ ఉన్న స్టోరీ, జగపతి బాబు హైలెట్
ఈ చిత్రంలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే అంశం సినిమా కథే. ఇది ఒక సోల్ ఉన్న స్టోరీ. ఎంటర్టెన్మెంటుతో పాటు హార్ట్ టచింగ్ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. జగపతి బాబు క్యారెక్టర్ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఆయనతో పాటు మరో సంపత్, బ్రహ్మాజీ, అలీ, పోసాని, ప్రభాస్ శీను, సురేఖ వాణి, సుబ్బరాజు, అజయ్ ఇలా ఒక 50 మంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. జగపతి బాబు చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశారు. ఆ పాత్రలో ఆయన్ను తప్ప మరొకరిని ఊహించుకోలేం.


Click it and Unblock the Notifications











