twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా దొబ్బినా బాధపడును, అలాంటి వాళ్లంటే అసహ్యం: రవితేజ

    By Bojja Kumar
    |

    Recommended Video

    Ravi Teja & Director Kalyan Krishna Interview

    ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో, మాస్ మహారాజా 'రవితేజ' హీరోగా రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నచిత్రం "నేల టిక్కెట్టు. రవితేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్‌గా నటించారు. మే 25న సినిమా గ్రాండ్ గా విడుదలువున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇందులో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ కత్తి కార్తీక చిత్ర బృందంతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా రవితేజ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

    నేను నేల టికెట్ నుండి వచ్చినవాడినే

    నేను నేల టికెట్ నుండి వచ్చినవాడినే

    చిన్నపుడు నేను నేలటికెట్ తో సినిమాలు చూశాను. అపుడు బాల్కనీ చూడాలంటే ఒక సినిమా... ఆ డబ్బులతో నేలటికెట్ కొంటే నాలుగు సినిమాలు చూడొచ్చు అని అలా చేసేవాళ్లం. అయితే 10వ తరగతి వచ్చేప్పటికీ అమ్మాయిలు వస్తారు బాగోదు కాబట్టి బాల్కనీకి వెళ్లేవారం అని రవితేజ గుర్తు చేసుకున్నారు.

     బాధ పడ్డా సరే నేను చెప్పాలనుకుంది చెబుతా

    బాధ పడ్డా సరే నేను చెప్పాలనుకుంది చెబుతా

    నేను ఏది చెప్పినా ఆ మాట మనసులో నుండి వస్తుంది. అది ఎదుటి వారికి బాధ కలిగించినా సరే ఉన్న విషయం చెబుతాను. ఎదుటివారు బాధ పడతారని అబద్దం చెప్పడం నాకు చేతకాదు. నేను చెప్పే మాట కొన్ని సార్లు బాధకలిగించినా తర్వాత అది నిజమే కదా అని వారే చివరకు రియలైజ్ అవుతారు.... అని రవితేజ తెలిపారు.

     అలా ఉండేవారు నచ్చదు

    అలా ఉండేవారు నచ్చదు

    నా ఎనర్జీ సీక్రెట్ ఏమీ లేదు. మనసు, మైండ్ క్లియర్ గా... హ్యాపీగా ఉంచుకోవడమే. ఇది అందరిలోనూ ఉంటుంది. డల్‌గా, రిజర్డ్వ్ గా ఉండేవాళ్లు అంటే నాకు పరమ చిరాకు. నేను చిన్నప్పటి నుండి అంతే.... అని రవితేజ అన్నారు.

     సినిమా దొబ్బినా బాధ పడను

    సినిమా దొబ్బినా బాధ పడను

    నేను ఏ విషయంలోనూ బాధపడను, బాధ పడేంత సీరియస్‌గా ఏ విషయాన్ని తీసుకోను. ఒక వేళ నేను చేసే సినిమా దొబ్బినా కూడా లైట్ తీసుకుంటాను. నెక్ట్స్ ఏంటి అని ఆలోచిస్తాను. దాన్ని తలుచుకుని బాధ పడటం నాకు చేతకాదు.... అని రవితేజ తెలిపారు.

    వాళ్లంటే పరమ అసహ్యం

    వాళ్లంటే పరమ అసహ్యం

    సినిమాలో చాలా సీన్లు పర్సనల్‌గా కనెక్ట్ అయి చేశాను. బ్యాంక్ సీన్లో పెద్దవాళ్లపై ఉండే సీన్ అందులో ఒకటి. నాకు ముందు నుండీ పెద్ద వాళ్లు అంటే రెస్పెక్ట్. ఇబ్బందుల్లో ఉన్నవాళ్లును చూస్తే చాలా బాధేస్తుంది. చాలా మంది తల్లి దండ్రులను పట్టించుకోని పిల్లలు ఉంటారు. వాళ్లంటే పరమ అసహ్యం.... అని రవితేజ వ్యాఖ్యానించారు.

    English summary
    Nela Ticket Movie Team Fun Interview With Kathi Karthika. Nela Ticket produced by Ram Talluri on SRT Entertainments banner and directed by Kalyan Krishna Kurasala. It features Ravi Teja, Malvika Sharma, Jagapati Babu in the lead roles and music is composed by Shakthi Kanth Karthick. The film is scheduled for a worldwide release on 25 May 2018.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X