ఆ పాప బాగా రిచ్, బాయ్ ఫ్రెండుతో వెళ్లావా? రవితేజ ముందే ఆమెపై అలీ పంచులు!

By Bojja Kumar

Recommended Video

Nela Ticket Team Exclusive Chit Chat

రవితేజ, మాళ్విక శర్మ జంటగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన 'నేల టిక్కెట్టు' మూవీ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా రవితేజ, మాళ్వికతో పాటు కమెడియన్లు అలీ, ప్రవీణ్, ప్రియదర్శి చిట్ చాట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నతనంలో తమ నేలటిక్కెట్ అనుభవాలను పంచుకున్నారు. అయితే తెలుగు అర్థం కాక సైలెంటుగా కూర్చుండి పోయిన మాళ్వికతో కమెడియన్ అలీ హిందీలో మాట్లాడుతూ పంచ్‌లు పేలుస్తూ నవ్వులు పూయించారు. రవితేజ సైతం అలీ వేసే పంచ్‌లకు నవ్వులు చిందిస్తూ ఎంజాయ్ చేశారు.

పదో తరగతి వరకు నేల టిక్కెట్టే

పదో తరగతి వరకు నేల టిక్కెట్టే

నా టెన్త్ క్లాస్ వరకు నేల టిక్కెట్టు మీదనే సినిమాలు చూశాను. ఇంట్లో ఒక బాల్కనీ టిక్కెట్ కోసం డబ్బులు తీసుకుని... దానితో నాలుగు నేలటిక్కెట్ సినిమాలు చూసేవాళ్లం. సినిమాలు చూడటానికి ఒక్కోసారి నాన్న జేబులో డబ్బులు కొట్టేసేవాడిని అని రవితేజ గుర్తు చేసుకున్నారు. ఈ జనరేషన్ వారికి నేల టికెట్ అంటే తెలియదని రవితేజ తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే 10వ తరగతి తరువాత మాత్రం అమ్మాయిల చూస్తారని కుర్చీ టిక్కెట్ కు వెళ్లేవారమని తెలిపారు.

పేరెంట్స్‌తో సినిమాకెళ్లినపుడు చిరాగ్గా ఉండేది: రవితేజ

పేరెంట్స్‌తో సినిమాకెళ్లినపుడు చిరాగ్గా ఉండేది: రవితేజ

చిన్నతనంలో మా పేరెంట్స్‌తో బాల్కనీ టికెట్‌కు సినిమా చూడటానికి వెళ్లినపుడు నాకు చిరాగ్గా ఉండేది. నేల టిక్కెట్లో కూర్చుని విజిల్స్ వేస్లూ సినిమా చూస్తే వచ్చే మజాయే వేరు. మన హీరోను దగ్గరగా చూడటం ఎంతో ఆనందంగా ఉండేది రవితేజ తెలిపారు.

 వాడు చాలా ఫీలైపోతాడు

వాడు చాలా ఫీలైపోతాడు

అలీ మాట్లాడుతూ... ‘ఇదే ఇండస్ట్రీలో నేలలో కూర్చుని సినిమా చూస్తే నేలగాడురా వీడు అంటూ ఎగతాళి చేస్తారు. మరి ఇదే ఇండస్ట్రీలో ఏదైనా ఫంక్షన్ జరిగితే వాడిని ముందు లైన్లో కూర్చోబెట్టకపోతే వాడు చాలా ఫీలైపోతాడు. సినిమా మాత్రం వెనకాల కూర్చుని చూస్తే అది స్టైల్, ఫంక్షన్లో మాత్రం ముందు కూర్చోవాలి. జనాలు అలా తయారయ్యారు' అని గుర్తు చేసుకున్నారు.

 పాప రిచ్... అంటూ యాంకర్ మీద

పాప రిచ్... అంటూ యాంకర్ మీద

ఈ చిట్ చాట్లో పాల్గొన్న యాంకర్‌ను ఉద్దేశించి నువ్వు నెలటిక్కెట్టులో కూర్చుని ఎప్పుడైనా సినిమా చూశావా? అంటూ అలీ ప్రశ్నించగా.... దీనికి ఆమె చూడలేదు అని సమాధానం చెప్పగానే ‘పాప బాగా రిచ్' అంటూ పంచ్ వేశాడు అలీ.

బాయ్ ఫ్రెండుతో వెళ్లావా?

బాయ్ ఫ్రెండుతో వెళ్లావా?

నువ్వు ఫస్ట్ మూవీ ఎప్పుడూ చూశావు? అంటూ అలీ హీరోయిన్ మీద ప్రశ్నలు సంధించాడు. దీనికి ఆమె పేరెంట్స్‌తో కాకుండా 9వ తరగతిలో తొలిసారి తమ స్నేహితులతో కలిసి నార్నియా సినిమాకు వెళ్లాను అంటూ సమాధానం ఇచ్చింది. దీనికి అలీ బాయ్ ఫ్రెండ్‌తోనా? గర్ల్ ఫ్రెండ్స్ తోనా? అంటూ ఆమె నుండి ఆసక్తికర సమాధాతు రాబట్టే ప్రయత్నం చేశాడు. దీనికి హీరోయిన్ ఇద్దరితోనూ కలిసి వెళ్లాను అంటూ తెలివిగా సమాధానం ఇచ్చింది.

సినిమా కథ చెప్పేసిన రవితేజ

సినిమా కథ చెప్పేసిన రవితేజ

ఈ సినిమా ఇద్దరు అనాదల కథ. ఈ చిత్రంలో నేను, జగపతి బాబుగారు అనాధలుగా కనిపించబోతున్నాం. వారి వెనక ఉన్న బ్యాక్ డ్రాప్ ఏమిటి? వారిద్దరి మధ్య జరిగే సంఘర్షణ ఏమిటి అనేది ఆసక్తికరంగా ఉంటుంది. తల్లిదండ్రులపై గౌరవం పెంచేలా సినిమా ఉంటుంది అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X