కొత్త రకం ప్రమోషన్స్ లో నేల టికెట్టు యూనిట్!
మాస్ మహారాజ్ రవితేజ నటించిన '' నేల టికెట్టు '' సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు శక్తికాంత్ సంగీతం అందించగా చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ చేసారు. రవితేజ మార్క్ ఎంటర్‌టైన్మెంట్ తో రూపొందించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉండబోతోందని సమాచారం.
ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తళ్లూరి నిర్మించిన ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ గా జరుగుతున్నాయి. సినిమా పేరు నేల టికెట్టు కావడంతో చిత్ర దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మరియు హీరోయిన్ మాళవిక శర్మ రేపు (గురువారం) సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ సంధ్య 70ఎంఎం ధియేటర్ లో టికెట్స్ విక్రయించబోతున్నారు.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్, హీరోయిన్ టికెట్స్ విక్రయించడం మొదటిసారని చెప్పాలి. అందరిని ఆలోచింపజేసే కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మరో హిట్ తన ఖాతాలో వేసుకుంటాడని ఆశిద్దాం. తన ట్రేడ్ మార్క్ హీరోయిజం తో రవితేజ నేల టికెట్టు సినిమాతో ప్రేక్షకులను అలరిస్తాడని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











