‘నేల టిక్కెట్టు’ గాళ్లతో పెట్టుకుంటే నేల నాకించేస్తారు (టీజర్)
మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మరో మాస్ ఎంటర్టెనర్ 'నేల టిక్కెట్టు'. సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి హిట్స్ అందించిన కళ్యాణ్‌కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. మే 24న సినిమా విడుదలకు సిద్ధమైన నేపత్యంలో ప్రమోషన్ల జోరు పెంచారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం టీజర్ విడుదల చేశారు. రవితేజ మార్క్ ఎంటనర్మెంటుతో ఈ చిత్రం సాగుతుందని తెలుస్తోంది.
‘నేల టిక్కెట్టు’ గాళ్లతో పెట్టుకుంటే నేల నాకించేస్తారు
టీజర్ ఆకట్టుకునే విధంగా కట్ చేశారు. రవితేజ అభిమానులు కోరుకునే అన్ని మాస్ ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి అనే విధంగా హింట్ ఇస్తూ దీన్ని రూపొందించారు. ‘నేల టిక్కెట్టు' గాళ్లతో పెట్టుకుంటే నేల నాకించేస్తారు... అంటూ రవితేజ చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.

మాళవిక శర్మ
ఈ చిత్రంలో రవితేజ లెక్చరర్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. రవితేజ సరసన మాళవిక శర్మ హీరయిన్. ఇందులో ఆమె మెడికల్ స్టూడెంట్ పాత్రలో నటిస్తోందిన సమాచారం. ఈ ఇద్దరి మధ్య సాగే లవ్ స్టోరీ ఆకట్టుకునే విధంగా ఉండబోతోంది.

ముఖ్య తారాగణం
రవితేజ, మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, సుబ్బరాజు, ఆలి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి, ప్రభాస్ శ్రీను, పృథ్వీ, సురేఖా వాణి, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

మే 24న రిలీజ్
ఈ చిత్రాన్ని మే 24న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫిదా ఫేం శక్తికాంత్ కార్తీక్ సంగీతం, ఛోటా కే ప్రసాద్ కూర్పు, బ్రహ్మ కడలి కళ, ముఖేష్ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు.
నిర్మాత: రామ్ తాళ్ళూరి
సమర్పణ: సాయిరిషిక
దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ కురసాల


Click it and Unblock the Notifications











