నేల టిక్కెట్టు ట్రైలర్ విడుదలయ్యేది ఎప్పుడంటే!
మాస్ మహారాజ రవితేజ నటించిన నేల టిక్కెటు చిత్రం ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా నేల టిక్కెట్టు ఆడియో వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రం మే 25 న విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ముందుగా ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టిపెట్టింది. అభిమానులని ఆకట్టుకునే థియేట్రికల్ ట్రైలర్ ని ఈ నెల 16 న విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో డెబ్యూ హీరోయిన్ మాళవిక శర్మ రవితేజ సరసన నటించింది.

కళ్యాణ్ కృష్ణ తెరక్కించిన గత రెండు చిత్రాలు మంచి విజయం సాధించడంతో నేల టిక్కెట్టు చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మించారు. ఫిదా ఫేమ్ శక్తి ఈ చిత్రానికి సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











