»   » ‘నెల్లూరి పెద్దారెడ్డి’ ఇది బ్రహ్మానందం సినిమా కాదు....

‘నెల్లూరి పెద్దారెడ్డి’ ఇది బ్రహ్మానందం సినిమా కాదు....

Posted By:
Subscribe to Filmibeat Telugu

నెల్లూరి పెద్దారెడ్డి.... ఈ పేరు వినగానే మనకు బ్రహ్మానందం కామెడీ సీన్ గుర్తుకువస్తోంది. అయితే ఇపుడు ఈ పేరుతో ఓ తెలుగు సినిమా రాబోతోంది. సతీష్ రెడ్డి, మౌర్యానీ, ముంతాజ్ హీరో హీరోయిన్లుగా దర్శకుడు వీజే రెడ్డి రూపొందించిన చిత్రం 'నెల్లూరి పెద్దారెడ్డి'. సిద్ధి విఘ్నేశ్వరా క్రియేషన్స్ పతాకంపై సీహెచ్ రఘునాథ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రభాస్ శీను, అంబటి శీను, సమ్మెట గాంధీ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

తాజాగా 'నెల్లూరి పెద్దారెడ్డి' చిత్రానికి సెన్సార్ యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు వీజే రెడ్డి మాట్లాడుతూ....ఈ చిత్రం పల్లె వాతావరణంలో సాగుతుంది. పచ్చటి పైరుల అందాలు ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఎక్కడా విసుగు అనిపించకుండా కథనం సాగుతుంది. కథ రీత్యా సెంటిమెంట్ చిత్రమైనా దాన్ని బ్యాలెన్స్ చేసేందుకు కావాల్సినంత వినోదం ఉంటుందన్నారు.

నలుగురికి మంచి చేసే పెద్దారెడ్డి ఓ యువతి కుటుంబానికి ఆశ్రయమిస్తాడు. ఈ క్రమంలో అతనికి అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. వాటి పర్యవసానంగా కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది ఆసక్తికరంగా చూపిస్తున్నాం. చింతామణి నాటక రిహార్సల్స్ సన్నివేశాలు ప్రత్యేకంగా రూపొందించాం. ఈ ఎపిసోడ్ అంతా ప్రేక్షకులను బాగా నవ్విస్తుంటుందని దర్శకుడు తెలిపారు.

ఈ చిత్రానికి మాటలు - సంజీవ్ మేగోటి, సినిమాటోగ్రఫీ - బాలసుబ్రహ్మణి, ఎడిటింగ్ - మేనగ శీను, సంగీతం - గురురాజ్, డాన్స్ - గోరా మాస్టర్.

English summary
Nellore Pedda Reddy Official Trailer 2018 released. The movie to release in Telugu on March 16. Directed by VJ Reddy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu