జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్! బాధిత యువతిపైనే లైంగిక ఆరోపణలు
Jani Master Case: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం ఈ కేసులో జానీ మాస్టర్ చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.ఈ కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందో ఓ లూక్కేయండి.
సినిమా ఇండస్ట్రీని జానీ మాస్టర్ వివాదం షేక్ చేసింది. జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ గా పని చేసిన శ్రేష్టి వర్మ సంచలన ఆరోపణలు చేసిందవి. తనపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు చేసింది. తనను పలుమార్లు బెదిరించి అత్యాచారం చేశాడని, ఆ విషయాన్ని బయటకు చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానంటూ భయపెట్టాడని ఆరోపించింది.

ఈ మేరకు జానీ మాస్టర్‌పై సెప్టెంబర్ 15వ తేదీన రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసింది. దీంతో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నార్సింగి పీఎస్‌కు బదిలీ చేయడం, కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం, ప్రస్తుతం ఈ కేసులో జానీ మాస్టర్ చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.
ఈ కేసులో తాజాగా ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. జానీ మాస్టర్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు చేసిన మహిళా కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మపై ఓ యువకుడు ఫిర్యాదు చేశారు. జానీ మాస్టర్ పై అత్యాచారం కేసు పెట్టిన లేడీ కొరియోగ్రాఫర్ తనను లైంగికంగా వేధించిందంటూ ఓ యువకుడు నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ యువకుడు ఎవరో కాదు. జానీ మాస్టర్ అల్లుడు షమీర్.
తన మామ జానీ మాస్టర్ తో కలిసి హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్‌లకు వెళ్లినప్పుడు లేడీ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ లైంగిక వేధింపులకు పాల్పడిందనీ, ఆమె తనని లిఫ్ట్,రెస్ట్ రూమ్, లాడ్జిలో తనపై లైంగిక దాడి చేసిందని ఆరోపించారు. అంతేకాకుండా.. తనను నగ్న ఫొటోలు తీసి బెదిరించిందని ఆరోపించారు. ఆ సమయంలో తాను మైనర్‌నని, ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు జానీ మాస్టర్ అల్లుడు షమీర్. అంతేకాకుండా..ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తన నగ్న ఫోటోలు అందరికీ పంపుతానని బెదిరించినట్లు ఆరోపించారు. శ్రష్టి వర్మ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నెల్లూరు పోలీసులను కోరారు షమీర్.
ఇదెలా ఉంటే.. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ బెయిల్ పిటిషన్‌పై రంగారెడ్డి కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. కాగా.. ఈ బెయిల్ పిటిషన్ ఈ నెల 14 కు వాయిదా వేస్తున్నట్లు రంగారెడ్డి ప్రత్యేక పోక్సో కోర్టు వెల్లడించింది. మరోవైపు.. 2022 గాను జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ ఎంపికయ్యారు. పురష్కారాన్ని ఈ నెల 8న దిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో అందిస్తామని జానీ మాస్టర్ కు ఆహ్వానం అందింది.
ఈ మేరకు జానీ మాస్టర్ బెయిల్ కూడా అప్లే చేశారు. కానీ, ఊహించని విధంగా జానీ మాస్టర్‌కు ప్రకటించిన జాతీయ పురస్కారాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నేషనల్ ఫిల్మ్ అవార్డు కమిటీ ప్రకటించింది. జానీ మాస్టర్ పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు కావడంతో నేషనల్ అవార్డును నిలిపేస్తున్నట్టు కమిటీ పేర్కొన్నది. అయితే పోక్సో కేసు నేపథ్యంలో అవార్డు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు, ఆహ్వానపత్రికను రద్దు చేస్తున్నట్లు ప్రకటనలో నేషనల్ ఫిల్మ్ అవార్డు సెల్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications











