రానా అదరగొట్టాడుగా..... (‘నేనే రాజు నేనే మంత్రి’ టీజర్)
‘నేనెప్పుడు చావాలో నేనే డిసైడ్ చేస్తా... నువ్వెప్పుడు చావాలో కూడా నేనే డిసైడ్ చేస్తాను... నా జీవితానికి నేనే రాజు నేనే మంత్రి’ అంటూ రానా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ టీజర్ రిలీజైంది.
హైదరాబాద్: 'నేనెప్పుడు చావాలో నేనే డిసైడ్ చేస్తా... నువ్వెప్పుడు చావాలో కూడా నేనే డిసైడ్ చేస్తాను... నా జీవితానికి నేనే రాజు నేనే మంత్రి' అంటూ రానా నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' టీజర్ రిలీజైంది.
బాహుబలి సినిమా తర్వాత రానాలో పెర్ఫార్మెన్స్ పరంగా చాలా మెచ్యూరిటీ కనిపిస్తోంది. తాజాగా ఈ టీజర్లో రానా స్టైల్, యాటిట్యూడ్ సూపర్ గా ఉందంటున్నారంతా. డైలాగ్ డెలివరీలో కూడా రానా బాగా రాటుదేలాడు.
టీజర్
తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ నేడు ప్రముఖ నిర్మాత, రానా తాతయ్య డి. రామానాయుడు జయంతి సందర్భంగా రిలీజ్ చేసారు.

పొలిటికల్ థ్రిల్లర్
సురేష్ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బాబు-కిరణ్ రెడ్డి-భారత్ చౌదరి నిర్మాతలు. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పోలిటికల్ థ్రిల్లర్ లో రాణా సరసన కాజల్ కథానాయికగా నటిస్తోంది.

రానా
రానా మాట్లాడుతూ.. "తాతగారి జయంతి సందర్భంగా "నేనే రాజు నేనే మంత్రి" టీజర్ ను విడుదల చేయనుండడం చాలా సంతోషంగా ఉంది. ఈ టీజర్ తో సినిమాలో నేను పోషిస్తున్న జోగేంద్ర పాత్ర స్వభావం ప్రేక్షకులకు పరిచయం అవుతుందన్నారు" అన్నారు.

తేజ
దర్శకుడు తేజ మాట్లాడుతూ.. "రానా పర్సనాలిటీని మాత్రమే కాదు.. అతడిలోని నటుడ్ని పూర్తి వైవిధ్యంగా "నేనే రాజు నేనే మంత్రి" చిత్రంతో రీప్రజెంట్ చేస్తున్నాను. ప్రేక్షకులు ఊహించని విధంగా ఈ చిత్రంలో రానా యాటిట్యూడ్ ఉంటుంది" అన్నారు.

రానా కెరీర్లో మైలు రాయి
సురేష్ బాబు మాట్లాడుతూ.. "రానా కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచిపోయే చిత్రం "నేనే రాజు నేనే మంత్రి" అన్నారు. రానా, కాజల్, అశితోష్ రాణా, కేథరిన్ థెరిస్సా, నవదీప్, పోసాని, జెపీ, రఘు కారుమంచి, బిత్తిరి సత్తి, ప్రభాస్ శీను, శివాజీ రాజా, జోష్ రవి, నవీన్ నేలి, ఫన్ బకెట్ మహేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











