twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫైట్ మాస్టర్ కుటుంబానికి ‘నేనే రాజు నేనే మంత్రి’ యూనిట్ 5 లక్షలు సహాయం

    నిర్మాత సురేష్ బాబు చేతుల మీదుగా ఫైట్ మాస్ట‌ర్ నాగ‌రాజు కుటుంబానికి 5ల‌క్ష‌ల చెక్ అంద‌జేశారు. నాగ‌రాజు నేనే రాజు నేనే మంత్రి షూటింగ్ స‌మ‌యంలో అనారోగ్యంతో చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే.

    By Bojja Kumar
    |

    నిర్మాత సురేష్ బాబు చేతుల మీదుగా మా అధ్య‌క్షులు శివాజీ రాజా ఆధ్వ‌ర్యంలో ఫైట్ మాస్ట‌ర్ నాగ‌రాజు కుటుంబానికి రూ. 5 ల‌క్ష‌ల చెక్ అంద‌జేశారు. నేనే రాజు నేనే మంత్రి షూటింగ్ స‌మ‌యంలో నాగ‌రాజు అనారోగ్యంతో మరణించిన సంగ‌తి తెలిసిందే.

    దీంతో ఆ చిత్ర యూనిట్ తో పాటు, సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన మ‌రికొంత మంది స‌హ‌కారంతో ఆర్ధిక స‌హాయం అందించారు. దీనిలో భాగంగా హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియో లో మా అధ్య‌క్షులు శివాజీ రాజా ఆధ్వ‌ర్యంలో నిర్మాత సురేష్ బాబు చేతుల మీదుగా బాధిత కుటుంబానికి 5 ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్ ను అందజేశారు. నాగ‌రాజు భార్య సంధ్య చెక్ ను అందుకున్నారు.

    ‘Nene Raju Nene Mantri’ unit gives 5 lakh cheque to fight master Nagaraju’s family

    నాగ‌రాజు-సంధ్య దంపతుల ముగ్గురు ఆడ‌పిల్ల‌లు బాగా చ‌దువుకుని ఉన్న‌త స్థానాల‌కు చేరుకోవాల‌ని సురేష్ బాబు ఆకాంక్షించారు. ఈ స‌హాయం ప‌ట్ల మా అధ్య‌క్షులు శివాజీ రాజా హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఫైట్ మాస్ట‌ర్ యూనియ‌న్ ప్రెసిడెంట్ స‌తీష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

    English summary
    We all know that fight master Nagaraju died during the time of ‘Nene Raju Nene Mantri’ shooting due to illness. In the presence of MAA president Shivaji Raja and other dignitaries, the unit has donated Rs. 5 lakhs cheque to the bereaved family of Nagaraju on the hands of producer Suresh Babu at Ramanaidu Studios in Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X