ఎన్.శంకర్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఓ చిత్రం నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూరీ జగన్నాధ్ లేటెస్ట్ ఫిల్మ్ నేనింతే హీరోయిన్ సియా ని ఎప్రోచ్ అవుతున్నట్లు సమాచారం. పూరీ గత హీరోయిన్స్ లాగానే ఈమె కూడా పాపులర్ అవుతుందని పరిశ్రమ భావిస్తోంది. దాంతో ఆమెకు వరసగా ఆఫర్స్ ఇవ్వటానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు. అదే వరసలో కళ్యాణ్ రామ్ కూడా ఉన్నారని వినికిడి. ఇక ఈ సినిమాకు రచన బి.ఎన్.ఎస్. రవి చేస్తున్నారు. హరి కృష్ణ కూడా నటించనున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంభందించిన ప్రకటన వెలవడనుంది.
Story first published: Thursday, July 16, 2026, 23:43 [IST]