పూరీ జగన్నాద్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన నేనింతే పవనాలు అప్పుడే హిందీ పరిశ్రమను సైతం తాకాయి. పూరీ గురువు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూసి ఇంప్రెస్ అయి అభిషేక్ బచ్చన్ కి అప్ డేట్ చేసాడని సమాచారం. దానికతను కూడా వెంటనే స్పందించి స్టోరీ లైన్ ఏమిటో తెలుసుకున్నాడు. హిందీలో చేస్తే తాను లీడ్ రోల్ చేయటానికి సిద్దమని రాము కి మెసేజ్ పాస్ చేసాడు. అయితే ఈ ప్రాజెక్టు మెటీరియలైజ్ కావాలంటే నేనింతే ఇక్కడ పెద్ద హిట్ కావాలి. ఇక ఈ విషయాన్ని కొందరు పబ్లిసిటీ స్టంట్ గా వర్ణిస్తున్నారు. నేనింతే లో రవితేజ,సియా హీరో,హీరోయిన్స్ నటించారు. ఈ నెల పధ్ధెనిమిదిన రిలీజ్ కానుంది.