సినిమావాళ్ళంటే రవితేజకు మంట!!

By Staff

Raviteja
శ్రీను వైట్ల 'దుబాయి శ్రీను'లో ఎమ్.ఎస్.నారాయణ పాత్ర ద్వారా సినీ పరిశ్రమలో పాతుకుపోయిన ఒక వర్గపు హీరోలు,వారి ఇగోలుపై సెటైర్స్ వేసి హిట్టు కొట్టారు. అలాగే 'ఖడ్గం' సినిమాలోనూ కృష్ణవంశి ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ పూర్తి స్ధాయిలో సెటైర్స్ వేసారు. ఇప్పుడు పూరీ తన 'నేనింతే' చిత్రంలోనూ ఆ తరహా సెటైర్స్ కనపడనున్నాయని చెప్తున్నారు. అయితే ఈ సినిమాలన్నిటిలోనూ హీరో రవితేజనే కావటం విశేషం. అయితే రవితేజకు ఈ రకమైన ఆసక్తి ఉందని అందుకే ఈ రకమైన కథలు,ట్రాక్ లు ఆయన సినిమాల్లో పెడుతున్నారని అంటున్నారు.

ఇక రవితేజ కూడా అసెస్టెంట్ డైరక్టర్ గా చాలా కాలం పరిశ్రమలో స్ట్రగుల్ పడి పడీ చివరకు హీరో అయ్యారు.తనదైన ప్రత్యేక మ్యానరిజంతో నిలదొక్కుకున్నారు. దాంతో ఆయన అనుభవించిన సన్నివేశాలు,ఫైర్ ని ఎలివేట్ చేసే పాత్రలు ఇష్టపడతాడనీ అందుకే అవి పెడుతున్నారంటున్నారు. అంతేగాక ఇటువంటి పాత్రలు వేయటానికి కంఫర్ట్ జోన్ ఫీలయ్యే చాలా మంది హీరోలు ఒప్పుకోరని,తమ సినిమాల్లో అలాంటి సీన్స్ పెడితే తర్వాత పరిశ్రమలో మనుగడ కష్టమవుతుందని ఆలోచిస్తారని అయితే అవేమీ లేకుండా వెంటనే సైన్ చేసే వ్యక్తి అని రవితేజ ని అంటారు.

ఇక నేనింతే సినిమాలో రవితేజ అసిస్టెంట్ డైరక్టర్ గా కనపడనున్నాడు. పూరీ పోకిరి చిత్రంలో మీడియా మీద,సాఫ్ట్ వేర్ ఫీల్డ్ పైనా సెటైర్స్ వేసారు. అలాగే ప్రతీ సినిమాలోనూ ఏదో ఒక సామాజిక విషయంపై సెటైర్స్ వేసే పూరీ ఈ సినిమాతో తనకు తెలిసిన సినిమా వ్యక్తుల మనుషుల హిపోక్రసీ,అందరినీ వెనక తిప్పుకోవాలనే వారి క్రూడ్ బుద్దులను ఏకి పారేయటానకి సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం.ఇక ఈ సినిమాలో ఓ పాత్ర కథ పట్టుకుని తిరిగే ప్రసహసనాన్ని చాలా ఫన్నీగా తీర్చిదిద్దాడని చెప్పుకుంటున్నారు.

అతను కథ పట్టుకుని దర్శకుడు దగ్గరకు వెళితే ...నిర్మాతను ఒప్పించమంటాడని,నిర్మాత తర్వాత హీరో దగ్గరకు వెళ్ళమంటాడు. ఆ తర్వాత అతను నాకు నచ్చితే సరిపోతుందా హీరోయిన్ ని ఒప్పించాలి అంటాడు..తర్వాత ఆమె మా చేతిలో ఏం ఉంది...కొనుక్కునే డిస్ట్రిబ్యూటర్ దగ్గరకి వెళ్ళమంటారు. అక్కడనుంచి వాళ్ళు ప్రేక్షకులకు నచ్చితేనే ఏదయినా నిలబడుతుంది. వారిని ఒప్పించుకు రా అంటారు. అలాంటి ట్రాక్ ఒకటి సినిమాలో ఉందని చెప్పుకుంటారు. ఏదైమైనా రవితేజ సినిమాల్లో కనపడే ఈ సినిమా సెటైర్స్ ఎవరికైనా గుచ్చుకుని వారికి మార్పువస్తుందా...లేక వేరే వాళ్ళు తమ సినిమాల్లో ఈ సినిమాపై సెటైర్ వేస్తోరో చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X