వరల్డ్ బెస్ట్ సినిమాలలో మహేష్ ది కూడా
హైదరాబాద్: మహేష్ బాబు చిత్రానిక మరో అరదుదైన గౌరవం దక్కింది. అందరినీ ఆశ్చర్యపరస్తూ.. ‘IMDB' వెబ్ సైట్ చేసిన సర్వేలో మహేష్ బాబు నటించిన 1, నేనొక్కిడినే చిత్రం నాలుగవ ప్లేసులో లో నిలబడింది. వరల్డ్ బెస్ట్ పిక్చర్స్ లో ఒకటిగా ఈ చిత్రం రావటం మహేష్ అబిమానులను ఆనందోత్సాహాలతో నింపేస్తోంది. ఈ చిత్రానికి 10 కి 8.7 రేటింగ్ వచ్చింది. అయితే ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద భారీ నష్టాన్ని చవిచూసింది. మహేష్ చిత్రాల్లో పెద్ద డిజాస్టర్ చిత్రంగా మిగిలపోయింది. . ‘Wintersleep', ‘Redirected' మరియు ‘Haider' చిత్రాలు టాప్ త్రీలో ఉన్నాయి. మనం చిత్రం 22 వ పొజీషన్ లో ఉంది.
మహేష్‌బాబు తాజా చిత్రం విషయానికి వస్తే...
మహేష్‌బాబు, శ్రుతిహాసన్ జంటగా ఓ చిత్రం తెరకెక్కనుంది. కొరటాల శివ దర్శకుడు. ఈ చిత్రానికి 'మగాడు' అనే టైటిల్ పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఇంతకు ముందు 'కన్నయ్య' అనే పేరు అనుకొన్నారు. అయితే 'మగాడు'పైనే చిత్రబృందం మక్కువ చూపిస్తోందని వార్తలు వచ్చాయి. అయితే ఈ రెండిటినీ దర్శక,నిర్మాతలు ఖండించారు. ఈ నెల్లోనే హైదరాబాద్‌లో చిత్రీకరణ ప్రారంభం కానుంది.

మహేష్ బాబు ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 15 సంవత్సరాలు అవుతోంది. ఇన్నాళ్లూ మహేష్ ఎన్నో డిఫెరెంట్ పాత్రలలో కనిపించి తనను తాను ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. భారతదేశంలోనే వెర్శటైల్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నాడు. దూకుడుమీదున్నాడు మహేష్‌బాబు. 'ఆగడు' సెట్స్‌పై ఉండగానే కొత్త సినిమా కొబ్బరికాయ కొట్టేశారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ కొత్త చిత్రం మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతోంది. ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.మోహన్ నిర్మిస్తున్నారు. ఈ మధ్యనే హైదరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది.
''అందరినీ అలరించేలా ఉంటుందీ చిత్రం. మహేష్ నుంచి ప్రేక్షకులు ఏమేం కోరుకుంటారో అన్నీ ఇందులో ఉంటాయి'' అని దర్శకుడు చెప్తున్నారు. చిత్రంలో రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, బ్రహ్మానందం, ముఖేష్ రుషి, సంపత్‌రాజ్, సుబ్బరాజు, తులసి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. చిత్రానికి కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కళ: ఎ.ఎస్.ప్రకాష్, ఛాయాగ్రహణం: మధి, సంగీతం: దేవిశ్రీప్రసాద్.


Click it and Unblock the Notifications











