‘నేను చాలా వరస్ట్’ అంటున్న నందమూరి హీరో
హైదరాబాద్ : వరుస ప్లాపులతో కొట్టుమిట్టాడుతున్న నందమూరి హీరో తారక రత్న...ఈ సారి డిఫరెంట్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వెంకట్ పంపన దర్శకత్వంలో రూపొందనున్న ఈచిత్రం టైటిల్ 'నేను చాలా వరస్ట్'. నాచారంలోని రామకృష్ణ స్టూడియోలో సోమవారం ఈచిత్రం ప్రారంభోత్సవం జరిగింది. పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి సాగర్ క్లాఫ్ ఇవ్వగా, ప్రసన్నకుమార్ కెమెరా స్విచ్చాన్ చేసారు.

ఈ చిత్రం గురించి తారకత్న మాట్లాడుతూ...తొలిసారి ఈచిత్రంలో యముడిగా నటిస్తున్నాను. నా కెరీర్లోనే ఈచిత్రం చాలా డిఫరెంట్. ఫూర్తి స్థాయిలో ఎంటర్ టైన్ చేసేలా ఈచిత్రం స్క్రిప్టు ఉంటుంది. కథకు అనుగుణంగానే ఈ సినిమా టైటిల్ పెట్టామని తెలిపారు.
'నేను చాలా వరస్ట్' అనే టైటిల్ పెట్టడానికి ప్రత్యేక కారణం ఉంది. మనుషులు బయటికి ఎలా ఉన్నా వారి మనసుకు వారు ఎలాంటి వారో తెలుసు. హీరో నేను చాలా వరస్ట్ అని ఫీలయ్యేలా హీరో పాత్ర ఉంటుందన్నారు. తారకరత్న చేసే పాత్ర పెద్ద ఎన్టీఆర్ చేసిన దుర్యోధనుడి పాత్రను పోలి ఉంటుందన్నారు.
ఈ చిత్రంలో ఇంకా మురళీ మోహన్, అజయ్, వేణు మాధవ్, తనికెళ్ల భరణి, సుధ, రాజీవ్ కనకాల, గిరిధర్, కాదంబరి కిరణ్, తాగుబోతు రమేష్ నటిస్తున్నారు. పాటలు : భారతీబాబు, ఎడిటర్ : నందమూరి హరి, కెమెరా : ఈశ్వర్, మ్యూజిక్ : పార్థ సారథి, సమర్పణ : లక్ష్మీ మల్లాగౌడ్, నిర్మాత : పి.ఎస్.ఎస్.గౌడ్, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : వెంకట్ పంపన.


Click it and Unblock the Notifications











