Don't Miss!
- Finance Gold Price Today: బంగారం ధర పై పైకే.. ఇక కొనలేమా..!
- News సీట్ల మార్పులో బీజేపీ కొత్త ట్విస్ట్- చంద్రబాబు నిర్ణయం ఏంటి..!!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Sports రోహిత్‌పై వేటు వేయడానికి కారణమిదే- రాబిన్ ఉతప్ప
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
సైకలాజికల్ థ్రిల్లర్‌గా నేను లేను.. ఆసక్తికరంగా ట్రైలర్
ఓయస్‌యం విజన్ - దివ్యాషిక క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం నేను లేను. లాస్ట్ ఇన్ లవ్ అనేది ఉపశీర్షిక. హర్షిత్ హీరో. ఈ చిత్రం ట్రైలర్ ని చిత్రం యూనిట్ విడుదల చేశారు. చిత్రీకరణ సహా అన్ని పనులు పూర్తయ్యాయి. ఫిబ్రవరి ఒకటిన విడుదలకు ఈ చిత్రం సిద్ధమవుతున్నది.
ట్రైలర్ రిలీజ్ విడుదల నేపథ్యంలో దర్శకుడు రామ్ కుమార్ మాట్లాడుతూ -ఒక అందమైన ప్రేమకథతో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ రక్తి కట్టిస్తుంది. ఇటివలే విడుదలైన టీజర్ కి అనూహ్య స్పందన వచ్చింది. థ్రిల్లింగ్ కాన్సెప్టుతో తీస్తే నవతరం నటీనటులతో తీసిన సినిమా అయినా ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు అనే నమ్మకం ఉంది. టీజర్‌కి మంచి ఆదరణ లభించింది. ఫిబ్రవరి ఒకటిన సినిమాను విడుదల చేస్తున్నాం. ఇప్పటివరకు భారతదేశంలో రాని సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న చిత్రమిదని చెప్పేందుకు గర్వంగా ఫీలవుతున్నాం అన్నారు.
హర్షిత్, వంశీకృష్ణ పాండ్య, శ్రీపద్మ, మాధవి, బిశ్వజిత్‌నాధ్, రుద్రప్రకాశ్, వేల్పుల సూరి, యుగంధర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఆశ్రిత్, ఛాయాగ్రహణం:ఎ. శ్రీకాంత్ (బి.ఎఫ్.ఎ), నృత్యాలు: జోజో, నిర్వాహణ: సురేష్‌కూరపాటి, పి.ఆర్.ఓ:సాయి సతీష్ పాలకుర్తి, విఎఫ్ఎక్స్: ప్రభురాజ్, ఎస్.ఎఫ్.ఎక్స్:పురుషోత్తం రాజు, ఆడియోగ్రఫీ:రంగరాజ్, కలరిస్ట్ః కళ్యాణ్ ఉప్పాలపాటి, ప్రచార చిత్రాలు: శ్రీక, సహాయదర్శకులు: జె.మోహన్‌కాంత్, దర్మేంద్ర, సురేశ్, సహనిర్మాత : యషిక, నిర్మాత : సుక్రి కుమార్, రచన- దర్శకత్వం : రామ్ కుమార్ ఎమ్.ఎస్.కె