'మోహన్ బాబు నా సోదర సమానుడు': బాలయ్య

ఇక ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ..."మోహన్ బాబు నాకు సోదర సమానుడు... శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ నా సొంత బ్యానర్ లాంటిది. నేను,మోహన్ బాబు ఒకేరకమైన ఐడియాలిజీతో ముందుకు వెళ్తూంటాము...మా నాన్నగారు నుండి ఇద్దరమూ క్రమశిక్షణ,సూటిగా మాట్లాడటం నేర్చుకున్నాము... అలాగే మోహన్ బాబుకు మంచి మ్యూజిక్ సెన్స్ ,టేస్ట్ ఉంది... అలాగే ఈ సినిమా టీమ్ మొత్తం యువకులు..అంతేగాక మోహన్ బాబు అసలు ఈ ప్రాజెక్టులో ఇన్ వాల్వ్ కాలేదని మొత్తం పిల్లలకే వదిలేసారని తెలిసింది... వీరందరకీ నా శుభాకాంక్షలు" అంటూ ముగించారు.
అలాగే ఈ సభలో ఇంకా కీరవాణి్,దర్శకుడు అజయ్ శాస్త్రి,స్పెషల్ ఎఫెక్ట్ అందచేసిన సునీల్,వై.వి.యస్ చౌదరి,నిర్మాత మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి,హీరోయిన్ స్నేహ ఉల్లాల్,ఎడిటర్ నవీన్,హీరో మనోజ్ మాట్లాడారు. ఇక చివరగా తన కుమారుడుని ఆశ్వీరదించటానికి వచ్చిన అతిధిలందరకీ పేరుపేరునా ధాంక్స్ చెప్పుకున్నారు మోహన్ బాబు.


Click it and Unblock the Notifications











