పూరీ జగన్ ఆ ప్లాప్ ని హిందీలోకి
రానా, ఇలియానా కాంబినేషన్ లో రూపొందిన 'నేనూ..నా రాక్షసి' చిత్రం తెలుగులో రిలీజై ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకన్న సంగతి తెలిసిందే.అయితే ఆ చిత్రం హిందీ ప్రేక్షకులకు నచ్చుతుందనే ఆలోచనలో ఉన్నారు పూరీ జగన్నాధ్.అలాగని రీమేక్ చేసే ఆలోచలో లేరు ఆయన.దాన్ని డబ్ చేస్తానంటున్నాడు.ఎందుకంటే రానా కి దమ్ మారో దమ్ చిత్రంతో హిందీలో పరిచయమయ్యారు. అలాగే ఇలియానా ఇప్పుడు బర్పీ చిత్రంతో ఇలియానా బాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అవుతోంది. ఇక ఆల్రెడీ పూరీ ..బుడ్డా చిత్రంతో బాలీవుడ్ కి పూర్తిగా పరిచయమయ్యారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే పూరీ ఈ చిత్రాన్ని హిందీలో మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











