'నేనూ ...నా రాక్షసి' గురించి మరీ అతి చేస్తున్న పూరీ జగన్నాధ్
పూరీ జగన్నాధ్, రాణా కాంబినేష న్ లో వచ్చిన నేనూ...నా రాక్షసి చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని కమర్షియల్ హిట్ అనీ, ఎ సెంటర్లలలో బాగా పే చేస్తోందని పూరీ జగన్నాధ్ చెప్తున్నారు. అలాగే ఈ చిత్రంలో నేను చాలా గొప్ప పాయింట్ ని డీల్ చేసానని అన్ని చోట్ల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. కేవలం స్ట్రెస్ వల్లే మనుష్యులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, ప్రపంచంలో మనిషి తప్ప ఎవరూ ఆత్మ హత్యలకు పాల్పడరని..అలాంటి చాలా క్లిష్టమైన సబ్జెక్టుని తాను ఎన్నో జాగ్రత్తలు తీసుకుని చేసానని, శ్రమకు తగ్గ ఫలితం దక్కిందని, ఎక్కడెక్కడనుంచో మెసేజులు వస్తున్నాయని, అందరూ ఎప్రిషియేట్ చేస్తున్నారని అన్నారు. అంతేగాక ఈ చిత్రాన్ని హిందీలోకి డబ్ చేస్తున్నామని, అక్కడా సూపర్ హిట్ అవుతుందని నమ్మకం ఉందని అన్నారు. అలాగే తాను ప్రస్తుతం చేస్తున్న బుడ్డా ప్రాజెక్టు గ్యారెంటీగా సెన్షేషన్ క్రియేట్ చేసే దశగా వెళ్తోందని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











