పూరీ జగన్నాధ్ 'నేను... నా రాక్షసి' స్టోరీ లైన్ ఏమిటి

By Srikanya

రాణా, ఇలియానా కాంబినేషన్ లో 'నేను... నా రాక్షసి' అనే చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని ఈనెల 29న విడుదల చేస్తున్నారు.ఈ చిత్రం స్టోరీ లైన్ ఏమిటంటే..ఇలియానా కి మంచి అందం,తెలివి తేటలు ఉంటాయి.కానీ ఆమె ఆలోచనలు అన్నీ ఆత్మహత్య మీదే ఉంటాయి.ఎంత బాగా బతకాలి? అని ఆలోచించే వయసులో ఆ అమ్మాయి... ఎలా చనిపోవాలో ప్లాన్స్ వేసుకుంటూంటిది.ఈ లోగా ఆమెకు ఓ ఫ్రొఫెషనల్ కిల్లర్ తో పరిచయమైంది.ఆ తరవాత ఏం జరిగింది? కథ ఎన్ని మలుపులు తిరిగింది? అన్నది మిగతా కథ. ఈ సినిమా గురించి పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ''కొత్త కథలు రావడం లేదు.. తీయడం లేదు... అని పదే పదే అంటుంటే తిక్కరేగి రాసిన కథ ఇది.

తాత్కాలిక సమస్యలకు ఆత్మహత్యను శాశ్వత పరిష్కారంగా ఎంచుకొంటున్నారు. ఎక్కువ శాతం యువతరమే ఆత్మహత్యలకు పాల్పడుతోంది. ఆ ఆలోచన నుంచి పుట్టిన కథ ఇది. ఓ రాక్షసిలాంటి అమ్మాయికీ, ఓ ప్రొఫెషనల్‌ కిల్లర్‌కీ మధ్య జరిగిన ప్రయాణం ఎలా ఉంటుందో తెర మీద చూడండి'' అన్నారు. ఇక ఈ చిత్రంలో రాణా ఓ ఫ్రొఫెషనల్ కిల్లర్ గా కనిపించనున్నారు. అలాగే ఇలియానా కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో కనపిస్తే, ముమైత్ ఖాన్ చిత్రం సెకెండాఫ్ లో లీడ్ రోల్ ప్లే చేస్తోందిఅలాగే ఈ చిత్రానికి ముగ్గరు బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్స్ పనిచేస్తున్నారు. వారు విశాల్-శేఖర్, విశ్వ, పప్పీ లహరి(బప్పీ లహరి కుమారుడు). వీరు ముగ్గరూ..రెండు పాటలు చొప్పున కూరుస్తూ..ఆరు పాటలు పూర్తి చేస్తారు. సమర్పణ: భవ్య, కళ: చిన్నా, కెమెరా: అమోల్‌ రాథోడ్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X