For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దాసరి మెచ్చుకోవటమే ఆస్కార్ అవార్డు

    By Srikanya
    |

    దాసరి గారు "టైటిల్ చాలా గమ్మత్తుగా ఉంది. ప్రోమోస్ కూడా గమ్మత్తుగా ఉన్నాయిరా'' అని అభినందించి, సినిమా చూస్తానని చెప్పడం ఆస్కార్ అవార్డ్ వచ్చినంత ఆనందంగా ఫీలవుతున్నా అంటున్నారు నూతన దర్శకుడు గోవింద్ వరహా. ఆయన దర్శకత్వంలో ఆనంద్, దివ్య జంటగా బాలప్రకాశ్ నిర్మించిన 'నేను నాన్న అబద్ధం' చిత్రం రీసెంట్ గా విడుదలైంది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో ఆయన అలా స్పందించారు. అలాగే రెండో వారంలో 75 కేంద్రాల్లో సినిమా నిలబడి ఉండటమే సినిమా విజయం సాధించిందని చెప్పడానికి ఆధారం. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట గౌతమీ థియేటర్‌లో తొలి వారం రూ. 3.75 లక్షల గ్రాస్‌ని వసూలు చేయడం సినిమా స్టామినాకి రుజువు. మరో 'సీతాకోకచిలుక' అంటున్నారు.

    వల్గారిటీ లేకుండా, డబుల్ మీనింగ్ డైలాగులు లేకుండా మరో 'సీతాకోకచిలుక' లాంటి సినిమా తీశాడనీ, యుక్తవయసులో కలిగే ప్రేమని తెరమీద కొత్త పుంతలు తొక్కించాడని జనం అంటుంటే చాలా సంతోషంగా ఉంది. హీరో హీరోయిన్లు ఆనంద్, దివ్య తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసినందువల్లే నాకూ పేరొచ్చింది. క్లైమాక్స్‌లో యండమూరి వీరేంద్రనాథ్ చెప్పే డైలాగులకి చప్పట్లు కొడుతున్నారు. ప్రకాశ్ భరద్వాజ్ పాత్ర కూడా వాళ్లని ఆకట్టుకుంటోంది. పాటలు, కంప్యూటర్ గ్రాఫిక్స్, పిళ్లా ప్రసాద్ పాత్ర హైలైట్ అయ్యాయి అన్నారు. 'అరుంధతి'లో చిన్నప్పటి అనుష్కగా అంటే చిన్న జేజమ్మగా చేసిన బేబీ దివ్య ఈ చిత్రంలో హీరోయిన్. అలాగే హీరోగా చేసిన ఆనంద్ గతంలో శివనాగేశ్వరరావు దర్శకత్వంలో 'ఫోటో' సినిమాలో చేసాడు.కానీ బ్రేక్ రాలేదు. ఆ తర్వాత '100% లవ్'లో సెకండ్ హీరోగా నటించాడు.ఇక దర్సకుడు గోవింద్ వరాహకీ ఇది రెండో సినిమానే.ఇదివరకు అతను 'బాల' సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు కానీ ఆ సినిమా ఫెయిల్యూర్ కావటంతో మిగిలిపోయాడు.

    English summary
    Film Nenu Nanna Abaddam is released on September 9th. Divya and Nandu are playing lead roles in this movie. Divya is none other than the little Jejamma in Anushka s super hit movie Arundhati. Divya is debuting as heroine with this film directed by Govind Varaha.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X