Don't Miss!
- Automobiles జనరల్ టికెట్ ప్యాసింజర్స్‌తో ఫుల్ రష్‌గా రిజర్వ్డ్ కోచ్‌లు.. ప్రయాణికుడి కంప్లెయింట్, రైల్వే శాఖ సీరియస్
- News జగన్ సోషల్ ఇంజనీరింగ్ లెక్కలకు ఎన్డీయే కూటమి సవాల్ ఇలా..!
- Technology వన్‌ప్లస్ నార్డ్ CE 4 ధరల వివరాలు లీక్.. గత మోడల్ కంటే తక్కువ ధరకే అందుబాటులోకి..!
- Sports Kavya Maran: తిలక్ వర్మ..నీకు దండంరా బాబు! video
- Finance Stock Market: భారీ లాభాల్లో విహరిస్తున్న సెన్సెక్స్-నిఫ్టీ.. అంతా బుల్స్ హవాతోనే..
- Lifestyle Car Vastu Tips: కారు ఉందా అయితే ఈ వాస్తు నియమాలు పాటించండి..ఈ డైరెక్షన్ లో పార్క్ చేస్తే
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
దాసరి మెచ్చుకోవటమే ఆస్కార్ అవార్డు
దాసరి గారు "టైటిల్ చాలా గమ్మత్తుగా ఉంది. ప్రోమోస్ కూడా గమ్మత్తుగా ఉన్నాయిరా'' అని అభినందించి, సినిమా చూస్తానని చెప్పడం ఆస్కార్ అవార్డ్ వచ్చినంత ఆనందంగా ఫీలవుతున్నా అంటున్నారు నూతన దర్శకుడు గోవింద్ వరహా. ఆయన దర్శకత్వంలో ఆనంద్, దివ్య జంటగా బాలప్రకాశ్ నిర్మించిన 'నేను నాన్న అబద్ధం' చిత్రం రీసెంట్ గా విడుదలైంది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో ఆయన అలా స్పందించారు. అలాగే రెండో వారంలో 75 కేంద్రాల్లో సినిమా నిలబడి ఉండటమే సినిమా విజయం సాధించిందని చెప్పడానికి ఆధారం. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట గౌతమీ థియేటర్లో తొలి వారం రూ. 3.75 లక్షల గ్రాస్‌ని వసూలు చేయడం సినిమా స్టామినాకి రుజువు. మరో 'సీతాకోకచిలుక' అంటున్నారు.
వల్గారిటీ లేకుండా, డబుల్ మీనింగ్ డైలాగులు లేకుండా మరో 'సీతాకోకచిలుక' లాంటి సినిమా తీశాడనీ, యుక్తవయసులో కలిగే ప్రేమని తెరమీద కొత్త పుంతలు తొక్కించాడని జనం అంటుంటే చాలా సంతోషంగా ఉంది. హీరో హీరోయిన్లు ఆనంద్, దివ్య తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసినందువల్లే నాకూ పేరొచ్చింది. క్లైమాక్స్‌లో యండమూరి వీరేంద్రనాథ్ చెప్పే డైలాగులకి చప్పట్లు కొడుతున్నారు. ప్రకాశ్ భరద్వాజ్ పాత్ర కూడా వాళ్లని ఆకట్టుకుంటోంది. పాటలు, కంప్యూటర్ గ్రాఫిక్స్, పిళ్లా ప్రసాద్ పాత్ర హైలైట్ అయ్యాయి అన్నారు. 'అరుంధతి'లో చిన్నప్పటి అనుష్కగా అంటే చిన్న జేజమ్మగా చేసిన బేబీ దివ్య ఈ చిత్రంలో హీరోయిన్. అలాగే హీరోగా చేసిన ఆనంద్ గతంలో శివనాగేశ్వరరావు దర్శకత్వంలో 'ఫోటో' సినిమాలో చేసాడు.కానీ బ్రేక్ రాలేదు. ఆ తర్వాత '100% లవ్'లో సెకండ్ హీరోగా నటించాడు.ఇక దర్సకుడు గోవింద్ వరాహకీ ఇది రెండో సినిమానే.ఇదివరకు అతను 'బాల' సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు కానీ ఆ సినిమా ఫెయిల్యూర్ కావటంతో మిగిలిపోయాడు.