»   » నేను నాన్న అబద్ధం అంటున్న 'అరుంధతి' జేజమ్మ

నేను నాన్న అబద్ధం అంటున్న 'అరుంధతి' జేజమ్మ

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  'అరుంధతి'లో చిన్నప్పటి అనుష్కగా అంటే చిన్న జేజమ్మగా చేసిన బేబీ దివ్య వయస్సుకి వచ్చేసింది. ఆమె ఇప్పుడు హీరోయిన్ గా తెరకెక్కేసింది. 'నేను నాన్న అబద్ధం' అనే టైటిల్ తో రూపొందుతన్న చిత్రంలో ఆమె హీరోయిన్ గా చేస్తోంది. ఆమెకిప్పుడు 14 యేళ్లు మాత్రమే. ఇక ఈ చిత్రంలో ఆనంద్ హీరోగా చేస్తున్నాడు. ఆనంద్ గతంలో శివనాగేశ్వరరావు దర్శకత్వంలో 'ఫోటో' సినిమాలో చేసాడు.కానీ బ్రేక్ రాలేదు. ఆ తర్వాత '100% లవ్'లో సెకండ్ హీరోగా నటించాడు.ఇక దర్సకుడు గోవింద్ వరాహకీ ఇది రెండో సినిమానే. ఇదివరకు అతను 'బాల' సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు కానీ ఆ సినిమా ఫెయిల్యూర్ కావటంతో మిగిలిపోయాడు. ఇక ఈ 'నేను నాన్న అబద్ధం' అందమైన లవ్‌స్టోరీతో పాటు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉన్న ఈ సినిమా తప్పకుండా హిట్టవుతుందని అతను చెబుతున్నాడు. దర్శకుడు గోవింద్ వరహా మాట్లాడుతూ - 'ఈ చిత్రం నిర్మించడానికి అన్ని విధాలా సహకారం అందించిన నిర్మాతలకు టెక్నీషియన్లకు కృతజ్ఞతలు. యథార్థంగా జరిగిన ఓ సంఘటన రైల్లో వెళుతూ తెలుసుకుని ఈ కథ తయారు చేసుకున్నదే 'నేను నాన్న అబద్ధం" కథ.

  మా కథలో నిర్మాతలే హీరోలు. వారి నమ్మకంతోనే ముందుకు వెళ్లాను. అందరూ మా చిత్రాన్ని చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్న"ట్లు తెలిపారు. సంగీత దర్శకుడు చిన్నచరణ్ మాట్లాడుతూ -'పాటలన్నీ బాగావచ్చాయి. అందరూ దీవిస్తారని కోరుకుంటున్నాన"ని తెలిపారు. ఈ కార్యక్రమంలో యండమూరి వీరేంద్రనాథ్, నందు, దివ్యానాగేష్, కరుణాకర్, కృష్ణ్భగవాన్, ఎన్.శంకర్, పిళ్లాప్రసాద్, మధుల శ్రీ్ధర్, అనితానాధ్, సురేందర్, అగస్త్యశాస్త్ర, రామకృష్ణా పిళ్లా, ఎడిటర్ మోహన్, శ్రీలేఖ, నాగిరెడ్డి, చింతకాయల రాంబాబు, గడ్డం బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ప్రకాష్ భరద్వాజ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సోనాలీ జోషి, అనిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రామకృష్ణ సేనాపతి, సంగీతం: చిన్న చరణ్, నిర్మాత: వి.బాలప్రకాష్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోవింద్ వరహా. 'నేను నాన్న అబద్ధం'ని కాస్మిక్ పిక్చర్స్ బేనర్‌పై బాల, ప్రకాశ్ అనే ఇద్దరు నిర్మాతలు నిర్మించారు. సెప్టెంబర్ 9న ఈ చిత్రం విడుదల అవుతోంది.

  English summary
  Film Nenu Nanna Abaddam is releasing on September 9th. Divya and Nandu are playing lead roles in this movie. Divya is none other than the little Jejamma in Anushka s super hit movie Arundhati. Divya is debuting as heroine with this film directed by Govind Varaha. This film is produced by Bala Prakash under Cosmic Pictures banner.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more