బాహుబలి 3 చెత్తగా రావడంతో పక్కన పడేసిన నెట్‌ఫ్లిక్స్.. రాజమౌళితో కలిసి మరో బిగ్ బడ్జెట్ ప్లాన్..
ఇండియన్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన బాహుబలి ఏ స్థాయిలో క్రేజ్ అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమా సక్సెస్ అనంతరం టాలీవుడ్ నుంచి వస్తున్న సినిమాల వాల్యూ మరింత పెరిగింది. పాన్ ఇండియా అనే దానికి అసలైన అర్దాన్ని చూపించిన బాహుబలి రెండు భాగాలతో ఆగిపోకూడదని దర్శకుడు రాజమౌలి ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ తో కలిసి పార్ట్ 3ని కూడా ఆల్ మోస్ట్ రెడీ చేసినప్పటికీ ఎందుకో మళ్ళీ కొత్తగా రీ షూట్ చేస్తున్నారు.

బాహుబలి 3: బిఫోర్ ద బిగినింగ్
టాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ బాహుబలి పార్ట్1,2ల తరువాత కొనసాగింపుగా మరిన్ని సినిమాలు వస్తే బావుంటుందని రాజమౌళికి చాలా మంది సలహా ఇచ్చారు. అభిమానులు కోరుకున్నది కూడా అదే. అందుకు జక్కన్న ప్రముఖ రైటర్స్ తో కలిసి కథను అయితే రెడీ చేయించాడు. బిఫోర్ ద బిగినింగ్ టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.

మొదటిసారి భారీ వెబ్ సిరీస్
వరల్డ్ వైడ్ గా వేల కోట్లతో వెబ్ సిరీస్ లను నిర్మించే ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ మొదటిసారి ఇండియన్ ప్రాజెక్ట్ ను భారీ స్థాయిలో ప్రొడ్యూస్ చేసేందుకు రెడీ అయ్యింది. అందుకు రాజమౌళి నుంచి సలహాలు తీసుకోవడమే కాకుండా వారిని కూడా నిర్మాణంలో బాగస్వామిగా చేసుకున్నారు. బాహుబలి 3కి రాజమౌళితో పాటు ప్రసాద్ దేవినేని కూడా నిర్మాతగా ఉన్నారు.

చెత్తగా రావడంతో
ఆనంద్ నిలకంఠ రాసిన కథ ఆధారంగా ద రైజ్ ఆఫ్ శివగామి, చతురంగా, ద క్వీన్ ఆఫ్ మాహిష్మతి అధ్యయలను సినిమాలో చూపించబోతున్నారు. అయితే మొదట ఈ సిరిస్ ను భారీ స్థాయిలో షూట్ చేశారు. కానీ ఫైనల్ కట్ చూసుకున్న అనంతరం చాలా చెత్తగా వచ్చిందని నెట్ ఫ్లిక్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆ సిరీస్ ను ప్రవీణ్ సత్తారు, దేవకట్టా డైరెక్ట్ చేశారు.

200కోట్ల భారీ బడ్జెట్ తో
వారు డైరెక్ట్ చేసిన సిరిస్ బాగా రాలేదని పక్కన పడేశారట. ఇక ఇప్పుడు మరోసారి రాజమౌళితో కలిసి నెట్ ఫ్లిక్స్ భారీ స్థాయిలో రీ షూట్ కు సిద్ధమైనట్లు సమాచారం. దాదాపు 200కోట్ల భారీ బడ్జెట్ తో మళ్ళీ కొత్తగా రూపొందించడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. మరో టాలెంటెడ్ దర్శకుడిని రంగంలోకి దింపినట్లు సమాచారం. రాజమౌళి పర్యవేక్షణలోనే పూర్తిగా వేరే నటులతో సిరీస్ ను సిద్ధం చేయనున్నట్లు టాక్.


Click it and Unblock the Notifications











