రికార్డు ధరకు RRR గ్లోబల్ స్ట్రీమింగ్ రైట్స్.. ఆ విషయంలో అమెజాన్‌కు షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్‌

సినిమాల డిజిటల్ హక్కుల సొంతం చేసుకొనే విషయంలో ఓటీటీ అగ్రసంస్థలు నెట్‌ఫ్లిక్స్, జీ5, అమెజాన్ ప్రైమ్ వీడియో మధ్య భారీ పోటీ ఉన్నట్టు కనిపిస్తున్నది. తాజాగా RRR సినిమా హక్కుల విషయంలో ఈ పోటీ అగ్ర ఓటీటీ సంస్థల మధ్య స్పష్టంగా వెల్లడైంది. అయితే ఈ హక్కుల సొంతం చేసుకోవడంలో అమెజాన్‌కు నెటిఫ్లిక్స్ షాకిచ్చిందనే విషయంలో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే..

RRR హక్కులు రికార్డు ధరకు

RRR హక్కులు రికార్డు ధరకు

ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న RRR చిత్రానికి సంబంధించిన శాటిలైట్, డిజిటల్ హక్కులు రికార్డుస్థాయికి అమ్ముడుపోయాయనేది దేశ సినిమా పరిశ్రమలో అతి పెద్ద వార్తగా చర్చనీయాంశమైంది.

Zee5 ఓటీటీ చేతికి

Zee5 ఓటీటీ చేతికి

అయితే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ వెర్షన్ల హక్కులను జీ5 చిత్రం సొంతం చేసుకొన్నది. అయితే ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..ఈ సినిమాకు సంబందఇంచిన హిందీ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకోవడం మరింత చర్చనీయాంశమైంది.

నెట్‌ఫ్లిక్స్ ధమకా..

నెట్‌ఫ్లిక్స్ ధమకా..

అలాగే RRR హిందీ హక్కులనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విదేశీ భాషల హక్కులను గ్లోబల్‌గా నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకొన్నట్టు తెలిసింది. ఇంగ్లీష్, పోర్చుగీస్, కొరియా, టర్కీష్, స్పానీష్ భాషలకు సంబంధించిన స్ట్రీమింగ్ హక్కులను నెటిఫ్లిక్స్ భారీ రేటుకు సొంతం చేసుకొన్నట్టు సమాచారం.

అమెజాన్‌పై నెట్‌ఫ్లిక్స్ ఆధిపత్యం మరోసారి

అమెజాన్‌పై నెట్‌ఫ్లిక్స్ ఆధిపత్యం మరోసారి

అయితే RRR డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల విషయంలో అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ మధ్య భారీగా పోటీ జరిగింది. ఈ పోటీలో అమెజాన్‌ను వెనక్కి నెట్టి నెటిఫ్లిక్స్ తన అధిపత్యాన్ని సొంతం చేసుకొన్నది. రికార్డు ధరకు ఈ హక్కులను సొంతం చేసుకొన్నది. ఈ విషయంలో అమెజాన్ వెనుక పడింది అనే విషయం ప్రస్తుతం మీడియాలో వైరల్ అవుతున్నది.

Recommended Video

Cinema Bandi Review, డోంట్ మిస్.. మంచి సినిమా | Netflix | Tollywood || Filmibeat Telugu
RRR ఎవరెవరు నటిస్తున్నారంటే...

RRR ఎవరెవరు నటిస్తున్నారంటే...

ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన RRR చిత్రంలో ఎన్టీఆర్, రాంచరణ్‌ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఈ చిత్రంలో అలియాభట్, అజయ్ దేవగన్, ఒలివియా మోరిస్, సముద్రఖని, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం 2022 వేసవిలో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X