'మనీ హీస్ట్' ఆఖరి సీజన్.. రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్
గత ఏడాది ఓటీటీ ప్రపంచంలో అత్యదిక మంది వీక్షించిన వెబ్ సిరీస్ లలో స్పానిష్ టీవీ షో 'మనీహీస్ట్' ఒకటి. ఒక్కసారిగా వెబ్‌సీరిస్ ల స్థాయిని పెంచిన ఈ సిరీస్ నెక్స్ట్ సీజన్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. 2017 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న మనీహీస్ట్ వరల్డ్ వైస్ గా అత్యదిక అభిమానులు సంపాదించుకుంది.
మొదట సీజన్ కేవలం లోకల్ గానే హిట్టయ్యింది. అది కూడా మొదట స్పానిష్ లో ప్రసారం అయ్యింది. ఇక ఎప్పుడైతే నెట్ ఫ్లిక్స్ ఆ సిరీస్ పై ఫోకస్ పెట్టిందో అప్పటి నుంచి వరుసగా నాలుగు సీజన్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. క్రైమ్ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్ ఇండియాలో కూడా భారీ స్థాయిలో హిట్టవ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది.

ఇక ఇప్పటికే 4 సిజన్లను విజయవంతం పూర్తి చేసుకున్న మనీహీస్ట్ 5వ సీజన్ తో రెడీ అమవుతోంది. ఇదే ఆఖరి సీజన్ కావడం వలన అభిమానుల్లో అంచనాల డోస్ అమితంగా పెరిగాయి. ఇక ఈ ఏడాది సెప్టెంబర్ కు నెట్ ఫ్లిక్స్ లోనే రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఒకవేళ కోవిడ్ వలన ఆలస్యం అయితే తప్పకుండా అక్టోబర్ లోపు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











