నెట్‌ఫ్లిక్స్ మల్టీస్టారర్ 'రానా నాయుడు'.. పవర్ఫుల్ వెబ్ సిరీస్ తో రాబోతున్న వెంకటేష్, రానా!

రానా దగ్గుబాటి, తన బాబాయ్ తో వెంకటేష్ కలిసి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. గతంలో నిర్మాత సురేష్ బాబు వీరి కలయికలో సినిమాను నిర్మించాలని గట్టిగా ప్రయత్నం చేశారు. చాలా మంది దర్శకులు నుంచి కొన్ని కథలు కూడా విన్నారు. అయితే ఏవి కూడా వారి స్థాయికి తగ్గట్టుగా సెట్టవ్వకపోవడంతో మళ్లీ వెనుకడుగు వేశారు. ఇక మధ్యలో వెంకటేష్ నాగ చైతన్య వెంకీ మామ విషయం తెలిసిందే.

ఇక నాకు కూడా మా బాబాయ్ వెంకటేష్ తో నటించాలని ఉందని చాలా సందర్భాల్లో రానా చెప్పాడు. ఇక ఫైనల్ గా ఆ కోరిక నెరవేరబోతుందని ఇటీవల సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చాడు. వెంకటేష్ రానా మొదటిసారి నెట్ ఫ్లిక్స్ కు సంబంధించిన ఒక వెబ్ సిరీస్ లో నటించబోతున్నారు. దానికి రానా నాయుడు అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు.

మొదటిసారి స్క్రీన్ షేరింగ్

మొదటిసారి స్క్రీన్ షేరింగ్

బాహుబలి సినిమా అనంతరం రానా దగ్గుపాటి విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ వస్తున్నాడు. కమర్షియల్ సినిమాలను పూర్తిగా పక్కన పెట్టిన రానా మల్టీస్టారర్ సినిమాల్లో కూడా నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇదివరకే ఒక క్లారిటీ ఇచ్చాడు. వెంకటేష్ కూడా చాలా సందర్భాల్లో వెబ్ సిరీస్ చేయాలని ఉందని చెప్పాడు. ఇక వీరిద్దరూ కూడా ఐకానిక్ షో 'రే డోనోవన్' రీమేక్ తో సరికొత్తగా ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. తెలుగులోనే కాకుండా హిందీ తమిళంలో కూడా ఈ వెబ్ సిరీస్ ప్రసారం కానున్నట్లు వివరణ ఇచ్చారు.

నా కల నిజమైంది

నా కల నిజమైంది

ఇక సోషల్ మీడియా ద్వారా రానా దగ్గుబాటి వెబ్ సిరీస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేసారు. మా బాబాయ్ విక్టరీ వెంకటేష్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇక ఇన్నాళ్లకు రానా నాయుడు వెబ్ సిరీస్ ద్వారా నా కల నిజమైంది. తప్పకుండా ఈ సీరీస్ ప్రతి ఒక్కరినీ తప్పకుండా ఆకట్టుకుంటుంది అని నేను భావిస్తున్నాను అనే రానా దగ్గుబాటి వివరణ ఇచ్చాడు.

వెంకీ కాన్ఫిడెన్స్

వెంకీ కాన్ఫిడెన్స్

యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సిరీస్ పై వెంకటేష్ కూడా ఎంతో నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది. చిన్నప్పటినుంచి రానా దగ్గుబాటిని ఒక మంచి నటుడిగా ఎదిగే వరకు చూస్తూనే ఉన్నాను. అతని ప్రతి అడుగులో ఏదో ఒక తెలియని కొత్తదనం కనిపిస్తోంది. ఇక నాకు కూడా ఎప్పటినుంచో రానాతో కలిసి నటించాలని ఉంది. ఈ సిరీస్ ద్వారా తాము ఇద్దరం కూడా ప్రేక్షకులకు సరికొత్త కిక్ ఇవ్వబోతున్నట్లు వెంకటేష్ వివరణ ఇచ్చారు.

 దర్శకులు ఎవరంటే?

దర్శకులు ఎవరంటే?

ఇక ఈ పవర్ఫుల్ కంటెంట్ ను ఇద్దరు దర్శకులు డైరెక్ట్ చేయబోతున్నారు. మీర్జాపూర్ వంటి బోల్డ్ కంటెంట్ ను తెరకెక్కించిన కరణ్ అన్షుమన్ తో పాటు మరొక టాలెంటెడ్ దర్శకుడు సుపర్న్ వర్మ ఈ సిరీస్ ను డైరెక్ట్ చేయనున్నారు. రానా దగ్గుబాటి మొదటి నుంచి కూడా ఈ సిరీస్ లో నటించడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నాడు. అయితే ముందుగా వేరే హీరోల ను సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకున్నారట. కానీ రానా దగ్గుబాటి ఎక్కువగా ఆసక్తి చూపించడంతో అతని సలహా మేరకు మళ్ళీ వెంకటేష్ ను సెలక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ కాన్సెప్ట్ సెట్స్ పైకి రానుంది. ఈ వెబ్ సిరీస్ హిందీ తమిళ తెలుగు ప్రేక్షకుల ముందుకు ఒకేసారి రాబోతోంది. మరి రానా నాయుడు సినిమాతో ఈ దగ్గుపాటి హీరోలు ఎలాంటి ట్రెండ్ సెట్ చేస్తారు చూడాలి.

Recommended Video

The Best Of Navarasa | Navarasa Review | Project Agni | Inmai | Suriya || Filmibeat Telugu
తారాగణం | రానా దగ్గుబాటి, వెంకటేశ్ దగ్గుబాటి

తారాగణం | రానా దగ్గుబాటి, వెంకటేశ్ దగ్గుబాటి

నిర్మాత | లోకోమోటివ్ గ్లోబల్ ఇంక్.
షోరన్నర్ | కరణ్ అన్షుమన్
దర్శకులు | కరణ్ అన్షుమన్, సుపర్న్ వర్మ
ఫార్మాట్ హక్కులు | వయాకామ్‌సిబిఎస్ గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ గ్రూప్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X