twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నెట్‌ఫ్లిక్స్‌లో ‘సత్యం’ రామలింగ రాజు బయోపిక్.. 'బ్యాడ్ బాయ్ బిలియనీర్స్'కి షాకిచ్చిన కోర్టు

    |

    రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ కి సంబంధించిన డాక్యుమెంటరీ సిరీస్ బ్యాడ్ బాయ్ బిలియనీర్స్ అనే టీజర్ ఇంటర్నెట్ వరల్డ్ లో వైరల్ అయిన విషయం తెలిసిందే. నలుగురు భారతీయ బిలియనీర్ల జీవితం ఆధారంగా ఈ డాక్యుమెంటరీని రూపొందించినట్లు ప్రచారాలు గట్టిగానే చేశారు. విజయ్ మాల్యా, సుబ్రతా రాయ్, నీరవ్ మోడీ, రామలింగరాజు వంటి వారిని టార్గెట్ చేస్తూ సిరీస్ ని రూపొందించారని తెలియడంతో విషయం కోర్టు వరకు వెళ్ళింది.

    షాక్ ఇచ్చిన సివిల్ కోర్టు

    షాక్ ఇచ్చిన సివిల్ కోర్టు

    సెప్టెంబర్ 2 న ఓటిటి ప్లాట్‌ఫాంపై విడుదల అవుతున్న తరుణంలో ఊహించనివిధంగా ఆ సిరీస్ ని విడుదల చేయకుండా హైదరాబాద్ సివిల్ కోర్టు మంగళవారం నిరోధించింది. సత్యం కుంభకోణంలో దోషిగా తేలిన సత్యం కంప్యూటర్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు బి.రామలింగరాజుతో పాటు మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా కోర్టు నిషేధాన్ని జారీ చేసింది.

    ప్రైవసీకి భంగం కలిగించేలా..

    ప్రైవసీకి భంగం కలిగించేలా..

    2018లో బెయిల్‌పై విడుదలైన రాజు దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా స్టే ఆర్డర్ రావడం హాట్ టాపిక్ గా మారింది.తన ప్రైవసీకి భంగం కలిగించేలా నెట్ ఫ్లిక్స్ చేపడుతున్న ఈ చట్టవ్యతిరేకమైన చర్యను వెంటనే అపాలని వెబ్ సిరీస్‌ను విడుదల చేయకుండా నిరోధించాలని కోరారు. ఈ డాక్యుమెంటరీ లో చాలా వరకు అసత్యాలు ఉన్నాయని తన ప్రతిష్టను తగ్గించడానికే ఈ విధంగా కుట్ర పనిన్నట్లు రాజు పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం తన కేసు విచారణ కోర్టు పరిధిలో ఉన్నందున్న వెబ్ సిరీస్‌ను ఆపాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

    వైరల్ అవుతున్న ట్రైలర్

    వైరల్ అవుతున్న ట్రైలర్

    ఇక నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే వెబ్ సిరీస్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఆ ట్రైలర్ వైరల్ అవుతున్న తరుణంలో రిలీజ్ కి బ్రేకులు పడ్డాయి. వివిధ ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ వ్యాపారవేత్త మెహుల్ చోక్సీ ఈ డాక్యుమెంటరీ ప్రివ్యూ కోరింది. అతను ఇంతకుముందు తన న్యాయవాది ద్వారా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు, అయితే ఆ అభ్యర్ధనను కోర్టు తిరస్కరించింది.

    Recommended Video

    Hero Sudheer Babu Special Interview On 'V' Movie
    సుబ్రతా రాయ్ పేరును ఉపయోగించకుండా..

    సుబ్రతా రాయ్ పేరును ఉపయోగించకుండా..

    ఇక, బీహార్‌లోని మరో న్యాయస్థానం నెట్‌ఫ్లిక్స్‌ను వెబ్ సిరీస్‌లో సుబ్రతా రాయ్ పేరును ఉపయోగించకుండా నిరోధించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సత్యం కంప్యూటర్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు రామలింగరాజు కోర్టును ఆశ్రయించడంతో ఆ సిరీస్ కి కోర్టు బ్రేక్ వేసింది.

    English summary
    Bad Boy Billionaires: India. The court passed a restraining injunction based on a petition filed by founder of Satyam Computer Services, B Ramalinga Raju, who was convicted in the Satyam scam along with three others.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X