For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సాయి ధరమ్ తేజ్‌తో నెటిజన్ వింత కోరిక: ఇస్తే నా పరిస్థితి ఇదేనంటూ.. ఆ ఫొటోతో షాకిచ్చిన హీరో

  |

  మెగాస్టార్ చిరంజీవి అల్లుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ ఆరంభంలోనే పలు విజయాలను అందుకున్న అతడు.. స్టార్‌గా ఎదిగిపోయాడు. ఈ క్రమంలోనే కొంత కాలంగా వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ ఫామ్‌తో దూసుకెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో మరిన్ని ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు. ఇక, తాజాగా సాయి ధరమ్ తేజ్ ఇన్‌స్టాలో లైవ్ చాట్ నిర్వహించగా.. నెటిజన్ వింత కోరిక కోరాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  అలా పరిచయం.. వరుస ఫ్లాప్‌లు

  అలా పరిచయం.. వరుస ఫ్లాప్‌లు

  మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. వైవీఎస్ చౌదరి తెరకెక్కించిన ‘రేయ్'తో పరిచయం అవ్వాల్సి ఉన్నా.. అది అనివార్య కారణాలతో వాయిదా పడడంతో ‘పిల్లా నువ్వు లేని జీవితం' ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్ ఆరంభంలోనే ‘సుబ్రమణ్యం ఫర్ సేల్', ‘సుప్రీమ్' వంటి హిట్లను తన ఖాతాలో వేసుకున్న మెగా హీరో.. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో సతమతం అయిపోయాడు.

   హిట్ ట్రాక్ ఎక్కి... హ్యాట్రిక్ హిట్లతో

  హిట్ ట్రాక్ ఎక్కి... హ్యాట్రిక్ హిట్లతో

  చాలా కాలం పాటు వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న తరుణంలో సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి'తో హిట్ ట్రాక్ ఎక్కాడు. దీని తర్వాత మారుతి డైరెక్షన్‌లో వచ్చిన ‘ప్రతిరోజూ పండగే'తో వరుసగా రెండో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇది అతడి కెరీర్‌లోనే బిగ్ హిట్‌గా నిలిచింది. ఇక, గత ఏడాది ‘సోలో బ్రతుకే సో బెటర్'తో వరుసగా హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నాడు.

   పొలిటికల్ సెటైర్లతో ‘రిపబ్లిక్' మూవీ

  పొలిటికల్ సెటైర్లతో ‘రిపబ్లిక్' మూవీ

  సూపర్ ఫామ్‌లో ఉన్న సాయి ధరమ్ తేజ్.. ప్రస్థానం ఫేం దేవకట్టా దర్శకత్వంలో ‘రిపబ్లిక్' అనే సినిమా చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ఈ సినిమా ప్రారంభం అయింది. భగవాన్, పుల్లారావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. పొలిటికల్ సెటైర్‌గా రాబోతున్న ఈ సినిమా రమ్యకృష్ణ సీఎంగా చేస్తోంది.

  అందులో యమా బిజీగా ఉంటూనే

  అందులో యమా బిజీగా ఉంటూనే

  వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నప్పటికీ సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటున్నాడు. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నాడు. అదే సమయంలో సినిమా అప్‌డేట్లు కూడా ఇస్తున్నాడు. అలాగే, సమాజంలో జరిగే ఎన్నో అంశాలపై స్పందిస్తూ సేవలు చేస్తున్నాడు.

  Most Awaited Movies Love Story , Kgf chapter 2 Updates || Filmibeat Telugu
   సాయి తేజ్‌తో నెటిజన్ వింత కోరిక

  సాయి తేజ్‌తో నెటిజన్ వింత కోరిక

  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సాయి ధరమ్ తేజ్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్‌ సెషన్ నిర్వహించాడు. ఇందులో నెటిజన్లంతా అతడిని రకరకాల ప్రశ్నలను అడిగారు. దానికి ఈ మెగా హీరో కూడా సహనంతో సమాధానాలు ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఓ ఔత్సాహిక అభిమాని సాయి ధరమ్ తేజ్‌ను ఏకంగా ఫోన్ నెంబర్ ఇవ్వమని అడిగాడు.

   తెలిస్తే పరిస్థితి అలాగే ఉంటుందని

  తెలిస్తే పరిస్థితి అలాగే ఉంటుందని

  సోషల్ మీడియా చాట్‌లో నెటిజన్ ఫోన్ నెంబర్ ఇవ్వమని అడగగా.. సాయి ధరమ్ తేజ్ ఓ ఊహించని ఫొటోతో అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. ‘శివమణి' సినిమాలో ఫోన్ నెంబర్ ఇవ్వగానే అందరూ కలిసి ఎమ్మెస్ నారాయణను కాల్స్ చేసి ఇబ్బందులు పెడుతుంటారు. ఇప్పుడదే సీన్లకు సంబంధించిన పిక్‌ను పెట్టిన సాయి తేజ్.. ‘నెంబర్ ఇస్తే నా పొజిషన్ ఇంతే' అని క్యాప్షన్ కూడా పెట్టాడు.

  English summary
  Tollywood Young Hero Sai Dharam Tej is Very Active in Social Media. Recently He Did Question and Anwser Session in Instagra. This Time Netizen Asked Mega Hero Phone Number.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X