సింగర్ సునీతకు షాకిచ్చిన కుర్రాడు: లైవ్‌లోనే అడగకూడని ప్రశ్న అడిగాడు.. ఆమె రిప్లై మాత్రం హైలైట్

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది సింగర్లు వచ్చారు.. వెళ్లారు. అందులో చాలా తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపును దక్కించుకుని టాప్ ప్లేస్‌ను అందుకున్నారు. అలాంటి వారిలో సునీత ఒకరు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా సినీ రంగంలో తనదైన శైలి గాత్రంతో కొన్ని వేల పాటలను ఆలపించారామె. కోయిల వంటి స్వరంతో శ్రోతలను తన వైపునకు తిప్పుకున్నారు. ఇక, కరోనా విజృంభిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మందికి ఉపశమనం కలిగించేందుకు లైవ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ కుర్రాడు సునీతకు భారీ షాకిచ్చాడు. అసలేం జరిగింది? వివరాల్లోకి వెళ్తే..

టీనేజ్‌లో మొదలైన సునీత ప్రస్థానం

టీనేజ్‌లో మొదలైన సునీత ప్రస్థానం

చాలా చిన్న వయసులోనే సంగీతం మీద పట్టు సాధించాలని శిక్షణ తీసుకున్నారు సునీత. ఆ తర్వాత ఎన్నో కార్యక్రమాల్లో పాటలు పాడారు. ఈ క్రమంలోనే 15 ఏళ్ల వయసులో ప్లేబ్యాక్ సింగర్‌గా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల పాటలను పాడారామె. ఈ సుదీర్ఘ ప్రయాణంలో సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎన్నో అవార్డులను అందుకున్నారు.

చిన్న వయసులోనే పెళ్లి.. విడాకులు

చిన్న వయసులోనే పెళ్లి.. విడాకులు

కెరీర్ పరంగా అప్పుడప్పుడే ఎదుగుతోన్న సమయంలో సింగర్ సునీత.. కిరణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. చాలా కాలం పాటు సవ్యంగానే సాగిన వీళ్ల కాపురం.. ఆ తర్వాత మనస్ఫర్థల కారణంతో న్యాయ పరంగా విడాకులు తీసుకుని విడిపోయారు. అప్పటి నుంచి ఇద్దరు పిల్లల బాధ్యతను తీసుకున్న ఆమె.. వాళ్లను పెంచి పోషించారు.

రహస్యంగా నిశ్చితార్థం... పెళ్లి మాత్రం

రహస్యంగా నిశ్చితార్థం... పెళ్లి మాత్రం

భర్తతో విడిపోయిన కొంత కాలం నుంచే సునీత రెండో పెళ్లి గురించి ఎన్నో వార్తలు వస్తుండేవి. కానీ, అవి పుకార్లుగానే మిగిలిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది ఆమె ప్రముఖ మీడియా సంస్థ అధినేత రామ్ వీరపనేనితో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు అమ్మపల్లిలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో సంబరంగా వివాహం చేసుకున్నారు.

రెండో వివాహం తర్వాత ఫుల్ యాక్టివ్

రెండో వివాహం తర్వాత ఫుల్ యాక్టివ్

రామ్‌ను పెళ్లాడిన తర్వాత సునీత జీవితం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి నుంచి ఆమె ఎంతో సంతోషంగా కనిపిస్తున్నారు. ఇందులో భాగంగానే తరచూ ఏదో ఒక ప్రదేశాన్ని సందర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం తన భర్తతో కలిసి సునీత.. భూలోక స్వర్గంగా పేరున్న మాల్దీవులు టూర్ వెళ్లారు. అక్కడి రిసార్టులు, బీచ్‌లలో తెగ ఎంజాయ్ చేశారు. ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి.

ఎప్పుడూ అందులోనే.. అన్నీ చెబుతూ

ఎప్పుడూ అందులోనే.. అన్నీ చెబుతూ

కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సింగర్ సునీత సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇందులో భాగంగానే తరచూ తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తున్నారు. అంతేకాదు, వ్యక్తిగత, కెరీర్‌కు సంబంధించిన విశేషాలను తన ఫాలోవర్లతో పంచుకుంటున్నారు. ఇలా సామాజిక మాధ్యమాల ద్వారా నిరంతరం వాళ్ల టచ్‌లో ఉంటూ హాట్ టాపిక్ అవుతున్నారు.

కరోనా సమయంలో అలాంటి నిర్ణయం

కరోనా సమయంలో అలాంటి నిర్ణయం

కరోనా వైరస్ రోజు రోజుకూ తీవ్ర రూపం దాల్చుతుండడంతో అందరూ ఇళ్లకే పరిమితం అయిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కోవిడ్ టెన్షన్ నుంచి జనాలను బయట పడేసేందుకు సునీత వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే ప్రతి రోజూ రాత్రి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అరగంట పాటు లైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో ఫ్యాన్స్ అడిగిన పాటలను ఆలపిస్తూ మజా చేస్తున్నారు.

Recommended Video

Singer Sunitha Wedding ఆదర్శప్రాయం అంటున్న Naga Babu !
సునీతకు షాకిచ్చిన నెటిజన్.. రిప్లై ఇలా

సునీతకు షాకిచ్చిన నెటిజన్.. రిప్లై ఇలా

రోజులాగే తాజాగా సింగర్ సునీత ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా చాలా పాటలను ఆలపించారు. సరిగ్గా అప్పుడే ఓ నెటిజన్ 'మేడం మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి' అని అడగకూడనిది అడిగాడు. దీనికి షాకైపోయిన సునీత.. నవ్వుతూనే సారీ అండీ అంటూ అతడి అభ్యర్థనను తిరస్కరించింది. ఇంత హుందాగా ప్రవర్తించిన ఆమెను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X